Romance: మీ భర్తను కాస్త గమనిస్తే ఆయన ఇచ్చే కొన్ని సంకేతాల ద్వారా మీతో శృంగార జీవితం ఎంజాయ్ చేస్తున్నారా? లేదా?? అన్నది చాలా తేలికగా తెలుసుకోవచ్చు. మరి, ఇంతకీ ఆ సంకేతాలే వంటే..మీ భర్త మీతో కలిసి శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లైతే మీ స్పర్శని కూడా అద్భుతం గా భావించి ఇష్టపడతారు. అంతేకాదు.. మీరు ఆయన్ని స్పర్శించినప్పుడు లేదా ఆయన మిమ్మల్ని స్పర్శించిన కొద్ది సమయంలో అతని కి శృంగారం చేయాలన్న కోరిక మొదలవుతుంది. దీంతో మిమ్మల్ని వారి బిగి కౌగిలిలో బంధించాలని చూస్తుంటారు. భార్య భర్తల మధ్యా ఎంత ఎక్కువ ప్రేమ, ఆప్యాయతలు ఉంటే వారి మధ్య బంధం కూడా అంతే దృఢం గా ఉంటుంది.
అందుకే మీ స్పర్శ తగిలిన తర్వాత ఎప్పుడు ఎప్పుడు మిమ్మల్ని వారి చేతుల్లోకి తీసుకుందామా.. పడక గదిలోకి తీసుకెళ్దాం… ఆలోచిస్తుంటారు. శృంగారం చేసిన తర్వాత చాలామంది ఎవరి దారిన వారు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. లేదా నిద్రలోకి జారుకుంటారు. కానీ మీ సాన్నిహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేసే వారైతే శృంగారం తర్వాత కూడా మీకు వారి ప్రేమ రుచి చూపిస్తుంటారు. చిన్న పిల్లలను ముద్దు చేసినట్లు ముద్దు చేయడం లేదా మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోవడం.. ప్రేమగా నిమరడం వంటివి చేస్తుంటారు. మీకు ఇలాంటి సంకేతం ఏమైనా మీ భర్త లో కనిపిస్తే మాత్రం ఆయన మీతో శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అర్థం. మీ భర్త మీతో శృంగారం చేయడం ఒక రొటీన్‌గా మార్చుకున్నారంటే దాని అర్థం.. మీతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు లెక్క. ఆయన మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి.. మీతో ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని అర్థం. అంటే శృంగారం దినచర్యగా మారింది అంటే మీయొక్క సుఖ, సంతోషకరమైన దాంపత్యానికి ఒక సంకేతంగా గుర్తించాలి.
పెదవులపై ముద్దు పెట్టుకుని సరిపెట్టుకోకుండా శరీరమంతటా తాకుతూ ముద్దాడాలని కోరుకుంటారు పురుషులు. ఈ ముద్దుల వర్షం తో మొదలుపెట్టి మెల్లగా శృంగార క్రీడను మొదలు పెట్టడం చాలామంది చేసే పని. అయితే శృంగారంలో పాల్గొనడం పూర్తైన తర్వాత కూడా.. మీ భర్త మిమ్మల్ని ప్రేమగా ముద్దాడుతుంటే మాత్రం మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మీతో మంచి శృంగార అనుభూతి పొందుతున్నారు అని చెప్పవచ్చు.