ice cream: అమృతం ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ మా ఉద్దేశం లో మాత్రం ఐస్‌క్రీమ్ ని అమృతం అనవచ్చు అంటున్నారు అనేక మంది.రకరకాల కారణాలతో కొందరు దీనికి దూరంగా ఉంటూ పిల్లల్ని కూడా ఉంచుతారు. ఇవన్నీ అర్థంలేని భయాలే అని తెలియచేస్తున్నారు బ్యూటీ నిపుణులు. అయితే ఐస్‌క్రీమ్ ని బయట కొనుక్కునే కన్నా ఇంటిలో తయారు చేసుకుని తినటం మంచిది.
చాలామందికి ఐస్‌క్రీమ్ రాత్రి పూట తినటం సరదాగా ఉంటుంది . కానీ అప్పుడు తినటం మంచిది కాదు. అందులో చక్కెర శాతం మోతాదు మించి ఉండటం వలన నిద్ర రాకుండా చేస్తుంది. అధిక చక్కెర, జీర్ణం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ కారణంగా నిద్రకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంకొంత మంది ఫంక్షన్ లకు లేదా పార్టీలకు వెళ్ళినప్పుడు ఆహారం కొంచెం ఎక్కువగా తింటుంటారు. ఇక రుచికరమైన విందుఅయ్యాక చల్లటి ఐస్‌క్రీమ్ తింటూ ఉంటారు. అయితే భోజనం చేసిన వెంటనే కూడా ఐస్‌క్రీమ్ తినవద్దు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తిన్న వెంటనే ఐస్‌క్రీమ్ తింటే జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అయితే ఐస్‌క్రీం మీద జరిగిన ఒక పరిశోధనలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయో తెలుసుకుందాం.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లాగా ఐస్‌క్రీం తింటే రోజంతా చురుకుగా ఉండవచ్చు అన్న విషయం పరిశోధనలో తేలింది.ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ ఇది సుమారు రెండు వేల మందిపై పరిశోధన చేసి చెప్పారు . వీరిని రెండు గ్రూపులుగా చేసి ఒక గ్రూపు వారికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లా తినటానికి ఐస్‌క్రీమ్ ఇచ్చారు. మరో గ్రూపు వారికి వారు రోజూ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ను మాత్రమే ఇచ్చారు. తర్వాత వారికి కొన్ని పజిల్స్ ఇచ్చి పూర్తి చేయమని చెప్పారు.
ఐస్‌క్రీమ్ తిన్న గ్రూపులో 60% నుండి 70% శాతం మంది చాలా త్వరగా, తేలికగా పజిల్‌ను పూర్తిచేయగా, రెండోగ్రూపు వారు దాన్ని పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది . వారి మధ్య ఈ తేడాకు కారణం బ్రేక్‌ఫాస్ట్ కింద ఐస్‌క్రీమ్ తీసుకోవడమే అని పరిశోధకులు తెలియచేస్తున్నారు. అయితే ఈ విషయం మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు.