Flax Seeds: సాధారణంగా మనకు లభించే గింజలలో అవిసె గింజలు కూడా ఒకటి.. న్యూట్రీషన్లు తరచుగా వీటిని అందరినీ తీసుకోమని సూచిస్తుంటారు.. అయితే మనలో కొద్దిమందికి మాత్రమే ఈ గింజల ఉపయోగాలు తెలుసు.. గింజల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం..!! అవిసె గింజల జెల్ తయారు చేసుకుని ఉపయోగిస్తే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..!!
ఈ జెల్ కోసం నాలుగు స్పూన్ల అవిసె గింజలను, ఒక చెంచా అలోవెరా జెల్, రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్, రెండు ఆల్మండ్ ఆయిల్ ను తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో అవిసె గింజలను వేసి రెండు కప్పుల నీటిని పోయాలి. మీరు చిక్కబడేవరకు బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని వడ పోసుకొని అందులో అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఆల్మండ్ ఆయిల్ ను వేసి బాగా కలుపుకోవాలి. ఇది జెల్ లా తయారు అవుతుంది.
ఇలా తయారు చేసుకున్న ఫ్లాక్స్ సీడ్ జెల్ ను జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత కాసేపు మర్దనా చేసి ఒక గంట సేపు అలాగే ఉంచాలి. ఆతరువాత గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. జుట్టు నిగనిగలాడుతుంది. ఈ జెల్ రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఇది జుట్టు ఊడిపోకుండా, రాలిపోకుండా, జుట్టు చివర్లు చిట్లిపోకుండా చేస్తుంది. తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కంటే ఇంట్లో ఈ జెల్ తయారు చేసుకొని ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ జెల్ 30 రోజులపాటు ఉపయోగిస్తే జుట్టు ఒత్తుగా పెరగడానికి చూసి మీరే ఆశ్చర్యపోతారు.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…