Social Media: ఆరోగ్యానికి సంభందించిఏదైనా వీడియో:
ఇప్పుడున్న సదుపాయాలతో అందరు 24 గంటలు ఇంటర్నెట్ వాడుకొనే అవకాశం ఉంది. అయితే, ఇంటర్నెట్ తో ఎంత మంచి జరుగుతుందో ,అంత చెడుకూడా జరుగుతుంది. నెట్ లో మనకు దొరికే సమాచారం అంతా నిజం కాదు అని మనం గుర్తించాలి. ముఖ్యం గా ఆరోగ్యానికి చెందినవాటి లో మరింత జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ లో ఆరోగ్యానికి సంభందించిఏదైనా వీడియో చూసినప్పుడు, ఆ వీడియో లో చెప్పిన సలహాలు సూచనలు పాటించే ముందు ఈ విషయాలు ఒకసారి పరిశీలించండి.
Social Media: ప్రశ్నలకు సరైన సమాధానం:
ఆరోగ్యానికి చెందిన విషయాలు చెప్పడానికి ఆ వీడియో పోస్ట్ చేసిన వారి అర్హతలు ఏంటి?
వారికి డాక్టర్ డిగ్రీ కలిగి ఉన్నారా?వారు ఇచ్చిన వైద్య సలహా ఇంతకు ముందు ఎవరైనా వాడి సమస్య తగ్గినట్టు రుజువు వుందా?
ఎలాంటి రుజువు లేకపోతే ఏదైనా గవర్నమెంట్ గాని లేదా ఆరోగ్య సంస్థ ప్రచురించిన పుస్తకంలో గాని వుందా? లేకపోతే ఆ వీడియో పెట్టిన వారిని అయినా అడిగి తీరాలి. వీడియో విడుదల చేసిన వారు, ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పక పోతే మాత్రం .. మీరు ఆ సలహా పాటించక పోవడమే ఉత్తమం.
ఎందుకంటే , చాల మంది ఎదో కంటెంట్ దొరికింది కదా అని తెలిసి తెలియక ఎదో వాట్సాప్ లో చుసిన మెసేజ్ నే వీడియో గ చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తున్నారు. అన్ని సలహాలు మనకు హాని కలిగించ పోవచ్చు, కానీ కొన్ని మాత్రం ఆ జబ్బు నయం చేయక పొగ, కొత్త వాటిని తీసుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రుజువు లేని చిట్కాలు పాటించకపోవడమే మంచిది. ఎందుకంటే చాలా వీడియోలు ఎన్నో రోజులుగా వున్నా వ్యాధులు చిన్న చిట్కాల తో తగ్గి పోతాయి అని ఆకర్షణీయమైన హీడింగ్స్ పెట్టి మరి చెబుతుంటాయి. ఎలాంటి హెడ్డింగ్ పెడితే మనం ఆ వీడియో చూడడానికి ఇష్టపడతామో
వారికి బాగా తెలుసు.
ఒక చిన్న చిట్కాతో దీర్ఘకాలిక రోగం:
అంతవరకు ఎందుకు ఒక సారి మీరే అలోచించి చూడండి.. ఒక చిన్న చిట్కాతో దీర్ఘకాలిక రోగం తగ్గిపోతే, ఇంకా ఇంత మందికి ఈ వ్యాధి ఎందుకు ఉంటోంది? ఈ చిట్కా ని ఆధారంగా చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు మందులు తయారు చేయడం లేదు? ఆయుర్వేదం లో వాడే మూలికలు ఆరోగ్యాన్ని ఇస్తాయి అయితే ఏవి ఎలా పనిచేస్తాయో,ఎలా వాడాలో అవి వైద్యులకే తెలుస్తాయి. అంతేకాక, మందుల్లో వాడబడే చాల మూలికలు శుద్ధిచేయబడిన తరవాతే వాడతారు. కాబట్టి యూట్యూబ్ , వాట్సాప్ లో వచ్చే చిట్కాలు పాటించే ముందు కాస్త ఆలోచించండి.