Digestion: మనం తీసుకునే ఆహారం జీర్ణం అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.. అదే ఆహారం జీర్ణం కాకపోతే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుుముడతాయి.. ముఖ్యంగా మాంసాహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.. అందుకని మాంసాహారం తిన్న తర్వాత సులభంగా జీర్ణం కావడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి చాలు..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మనం తిన్న మాంసాహారం త్వరగా జీర్ణం అవ్వాలంటే అల్లం రసం ఎంతో సహాయపడుతుంది. అల్లం రసం తీసుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మాంసాహారం తిన్న గంట తర్వాత టీ స్పూన్ అల్లం రసం తాగవచ్చు. కావాలంటే అల్లం రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. దాంతో సులువుగా అరుగుతుంది. పుదీనా రసం కూడా డైజెస్ట్ అవ్వడానికి దోహదపడుతుంది. లేదంటే మాంసాహారం తిన్న తరువాత 4 పుదీనా ఆకులు నమిలిన కూడా ఫలితం ఉంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జామకాయలు, నారింజ, ద్రాక్ష పండ్లను తిన్నా కూడా మాంసాహారం అరుగుతుంది. లేదంటే ఒక లవంగం తిన్నా కూడా డైజెస్ట్ అవుతుంది. ఒక స్పూన్ సొంపు గింజలు నమిలితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఫైనాపిల్ ముక్కలు తిన్నా లేదా ఫైనాపిల్ జ్యూస్ తాగినా కూడా సులభంగా అరుగుతుంది. భోజనం చేసిన అరగంట తర్వాత ఫైనాపిల్ జ్యూస్ తాగితే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.