Carona Vaccine: కరోనా ని కట్టడి చేయటానికి కరోనా వ్యాక్సినేషన్ చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అనేక అనుమానాలు చాలా మంది లో ఉన్నాయి.వీటికి సంబంధించి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిగురించి తెలుసుకుంటే మీ అనుమానాలు అన్ని తీరిపోతాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక కొన్నింటికి దూరంగా ఉండటం తో పాటు, తినే ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని తెలియచేస్తున్నారు .
కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఒక వారం ముందు నుంచి, తీసుకున్న ఒక వారం తర్వాత వరకు మందు కొట్టడానికి దూరంగా ఉండటం చాలా మంచిది. నిజానికి, వ్యాక్సిన్ తీసుకునే వారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని రూల్ ఏమి లేదు. కాకపోతే, వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మద్యం తీసుకోవటం వలన తగ్గక పోవడంతో పాటు కొన్ని సార్లు తీవ్రంగా మారి అనారోగ్య సమస్యలను తీసుకువస్తాయి. పొగతాగడానికి కూడా దూరంగా ఉంటేనే మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, వ్యాక్సిన్ తీసుకున్నాక ఎక్కువ రెస్ట్ తీసుకోవడం మంచిదని తెలియచేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుని రెండు రోజులు రెస్ట్ లో ఉంటే, సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గుతాయని తెలియచేస్తున్నారు. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ కి వెళ్ళకూడదు. ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకుని తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని తెలియచేస్తున్నారు.వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కనీసం ఒక వారం పాటు మనం తినే ఆహారంపై జాగ్రత్తలుఅవసరం. తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పండ్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు ఆహారం గా తీసుకోవటం మంచిది.
చెక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒకవేళ జ్వరం కానీ వస్తే పారాసెటమాల్ వేసుకోవచ్చు. జ్వరం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాకూడా రెండు రోజుల్లో తగ్గిపోతాయి. కానీ వారం పాటు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గక పోతే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్లడం నిర్లక్ష్యం చేయకూడ