Subscribe for notification
Categories: హెల్త్

Feet care: మీ అందమైన పాదాలు పదిలంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!!

Share

Feet care: చాలామంది ఆడవాళ్లు తమ అందం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు కానీ పాదాల విషయానికి వచ్చేటప్పటికి వాటిని పట్టించుకోవడమే మానేస్తారు. ముఖానికి, చర్మానికి, జుట్టుకు ఇచ్చిన ప్రాధాన్యత కాళ్ళ పాదాల విషయంలో చూపించరు. ఫలితంగా పాదాల పగుళ్ల సమస్య ఎక్కువ అయిపోతుంది. నిజానికి పాదాల పగుళ్ళు అనేవి కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాతావరణ మార్పుల కారణం,ఆహార లోపం,పాదాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాలు పగులుతుంటాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ పాదాల పైన శ్రద్ద వహిస్తూ ఉండాలి. మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తే మీ పాదాలు మృదువుగా అందంగా మారిపోతాయి. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా.

Follow these tips to keep your beautiful feet firm .. !!

వెజిటబుల్ ఆయిల్స్‌ ను ఇలా వాడి చుడండి :

వెజిటబుల్ ఆయిల్స్‌ అనేవి పాదాల పగుళ్లను తగ్గించడంలో ముందు ఉంటాయి.ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనెలను మీరు మీ పాదాల సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు.మీరు మీ ఇంట్లోని పని అంతా అయిపోయి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మీ పాదాలను శుభ్రంగా సబ్బు నీటితో పాదాల మీద ఉన్న మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి.ఆ తరువాత ఒక పొడి క్లాత్ ను తీసుకుని పాదాలను శుభ్రంగా తుడిచి మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్ ఆయిల్స్‌ లో ఒకదాన్ని పాదాలకు రాయాలి. ఆ తరువాత సాక్సులు ధరించి నిద్రించాలి.ఇలా ప్రతిరోజు ఒక వారం పాటు చేస్తే మీ పాదాలు మృదువుగా మారతాయి.

Follow these tips to keep your beautiful feet firm .. !!

వేప ఆకులు, పసుపుతో పాదాల పగుళ్ళకు చికిత్స :

వేపాకు గురించి మన అందరికి తెలిసే ఉంటుంది.. ఈ వేపాకు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.అందుకే వేపాకును ఉపయోగించి సులువుగా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు.అందుకోసం మీరు కొద్దిగా వేపాకులు తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి.అలా మెత్తగా చేసుకున్న వేపాకు పేస్ట్ లో మూడు టీ స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లపై రాసి ఓ గంటపాటు అలానే ఉంచి తరువాత కడుక్కోవాలి.ఇలా చేయడం వలన పాదాలలో దురద,ఇన్ఫెక్షన్ సమస్యలు తగ్గడంతో పాటుగా పాదాల పగుళ్ళు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే వేపాకు దొరకని వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, కాస్త పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి నూనె గాని వాజీలైన్ గాని,పెట్రోలియం జెల్లీని గాని రాసుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి.

Follow these tips to keep your beautiful feet firm .. !!

పాదాల పగుళ్లకు రోజ్ వాటర్, గ్లిజరిన్‌

పాదాల పగుళ్ళు తగ్గాలంటే గ్లిజరిన్, రోజ్ వాటర్ ను ఉపయోగిస్తే సరి.ఈ రెండింటిని సమానంగా తీసుకుని రాత్రి నిద్ర పోయేముందు మడమలు, పాదాలకు రాసుకుని పనుకుంటే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.అలాగే కాసిన్ని గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు ఆ నీటిలో ఉంచి తరువాత పొడిగా ఉండే వస్త్రంతో తుడిస్తే పాదాల పగుళ్ళు తగ్గుతాయి.


Share
Ram

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

10 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

26 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago