హెల్త్

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మీ కిడ్నీలు కాపాడుకోండి

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మీ కిడ్నీలు కాపాడుకోండి
Share

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటి ప్రాధాన్యత నీటిదే . రోజు తప్పకుండా తగినన్ని నీళ్లు తాగాలి. నీరు శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా రక్షిస్తుంది. రోజూఅశ్రద్ధ చేయకుండా 7-8 గ్లాసుల నీళ్లు తాగితీరవలిసిందే. ఎక్కువగా నీటిని తాగడం  వల్ల కిడ్నీలలో ఉండే  విష పదార్థాలు తేలిగ్గా బయటకు పోతాయి.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మీ కిడ్నీలు కాపాడుకోండి

యాపిల్ లో పుష్కలంగాఉండే  ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కొలెస్ట్రాల్ స్థాయి  గుండె జబ్బులు , తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు సహకరిస్తాయి.   డయాబెటిస్ ఉండడం వలన కిడ్నీలకు ప్రమాదం ఏర్పడుతుంది . కాబట్టి యాపిల్  తినడం వల్ల కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు. పుట్టగొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి . వీటి వల్ల రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది .వెల్లులితో శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . ఇవి రక్తాన్ని శుద్ధి చేసి  కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు పంపేలాగా చేస్తుంది. వీటిని పచ్చిగా లేదంటే వంటల్లో వేసుకుని తిన్నా చక్కని ఫలితాలని పొందవచ్చు.

స్ట్రాబెర్రీలలో ఉండే ఫైబర్, విటమిన్లు జీర్ణవ్యవస్థను మెరుగ్గా పనిచేసేలాగా చేస్తాయి . వీటిలో ఉండే పొటాషియం,మాంగనీస్ కిడ్నీల పనితీరు బాగుండేందుకు సహకరిస్తాయి. ఓట్స్ తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లుఏర్పడడం తగ్గుతుంది. పొద్దునే బ్రేక్ ఫాస్ట్‌గావీటినితీసుకోవడంమంచిది.కాలిఫ్లవర్‌లో ఉండే పొటాషియం, సల్ఫర్, శరీరంలోఉండే టాక్సిన్లను బయటకు పంపేస్తాయి. ఫలితంగా కిడ్నీల పని తీరు బాగుంటుంది.  బీపీని తగ్గించడం లో ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి . మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో సోడియం తక్కువగా ఉండడం వలన కిడ్నీలపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన కిడ్నీలు ఆరోగ్యగా ఉంటాయి .  


Share

Related posts

గోంగూర మటన్ ఇలా చేస్తే ప్లేట్ లో ఒక్క ముక్క కూడా మిగల్చరు..!

bharani jella

Eatela Rajendar: కేసీఆర్ కు అదిరిపోయే షాక్ రెడీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్

sridhar

చేదుగా ఉన్నా వీటిని తప్పకుండా తినాలిసిందే..!!

Ram