ఆరోగ్యం గా ఉత్సహంగా ఉండేందుకు శక్తి ని ఎలా పెంపొందించుకోవాలో కొన్నిచిట్కాలు మీకోసం.
ఏదైనా తినేటప్పుడు ఆహారంపైనేదృష్టి ఉంచాలికానీ, టీవీ చూస్తునో, మొబైల్ చూస్తూనోఅన్నం తింటే మీరు ఏమి తిన్నాకూడా వంటపట్టదు.
పోషకాలు కలిగిన ఆహారాన్నే తీసుకోవాలి. చక్కని శరీరాకృతి రావడానికి అలాగే ఒత్తిడిని తట్టుకునే శక్తిరావడానికి మీరు తీసుకునే ఆహారం చాల ముఖ్యమైనది. సంపూర్ణ ఆహారం తీసుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి. అలా చేయడం వలన అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
పప్పులు ,గింజలు మీ డైట్ కు అదనపు పోషకాలను జత చేస్తాయి . ఏ కాలం లో దొరికే పండ్లు ,ఆకాలం లో తప్పకుండా తినాలి . ప్రొసెస్డ్ ఫుడ్స్ ను అతిగా తీసుకోవడం మంచిది కాదు. యోగా ఆలాగే మెడిటేషన్ వంటి వాటితో మనసును ప్రశాంతం గా ఉంచుకోండి . వీటిని ఎక్కువ కాలం సాధన చేస్తూ ఉంటే ఒత్తిడి కారకాలు కూడా తగ్గిపోతాయి . రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి 15 నుంచి 20 నిమిషాలు మెడిటేషన్ కోసం తప్పనిసరిగా కేటాయించండి.
వేలకు భోజనం చేయడం,వేళ్ళకు పడుకోవడం,నిద్ర లేవడం అనే నియమం పాటించండి..దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది.మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మంచి సంగీతము వినటము వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలను దూరము చేసుకోవచ్చు అని పరిశొధనలు తెలుపుతున్నాయి కాబట్టి మనస్సును ఆహ్లాదపరిచే సంగీతాన్ని మంద స్వరములో వినాలి. నవ్వు,ఆందోళన,ఒత్తిడులకు దివ్య ఔషదముగా పనిచేస్తుంది నవ్వేటప్పుడు ఎండోర్ఫిన్స్ అనే హార్మోనులు విడుదల అయి ఒత్తిడిని తగ్గిస్తాయి కాబట్టి ఆందోళన ఒత్తిడులు ఎదురైనప్పుడు టి.వి లో కామెడి చానళ్ళు చూడడం లేదా మంచి జోక్స్ చదవడం చేస్తూ ,హాయిగా బిగ్గరగా నవ్వండి . స్నేహితులతో జోక్స్ పంచుకొని హాయిగా నవ్వుకోండి.