ఇలా చేస్తే సంపన్నులుగా అవ్వడం తో పాటు చక్కని జీవితం మీ సొంతమవుతుంది..

సంపన్నులు గా ఉండాలని ఎవ్వరికి మాత్రం ఉండదు కానీ అలా అవాలంటే ప్రతి ఒక్కరు తమలో ఉన్న లోపాలను వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి . ఆ ప్రయత్నం లో భాగం గా ప్రతి వ్యక్తి తనకు తాను ఆత్మపరిశీలన చేసుకుంటూ లోపాలను దిద్దు కుంటూ అంకిత భావం తో ఉన్నపుడు మాత్రమే ఎప్పటికి సంపన్నులు గా ఉండగలుగుతారు.అది ఏంటి డబ్బు సంపాదనకి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఇది పూర్తిగా చదవండి తెలుస్తుంది. .
ఇలా చేస్తే సంపన్నులుగా అవ్వడం తో పాటు చక్కని జీవితం మీ సొంతమవుతుంది..చాల మంది వ్యక్తులు  చేస్తున్న పనిలో లో ఇమడలేక అసంతృప్తి తో కొనసాగుతూ ఉంటారు.ఇలా తాము  చేసే వృత్తి పట్ల అయిష్టత పెంచుకున్న వ్యక్తులు ఎట్టి పరిస్థితులలోను విజయాన్ని సాధించలేరు. దీనికి తోడు ఎవ్వరైతే  ఎప్పుడు  ఎదుటి మనిషిలోని తప్పులు వెతుకుతూ  వారితో  మాట్లాడేటప్పుడు ఆ తప్పుల ను అస్తమానం ఎత్తి చూపిస్తూ  తిడుతూ  ఉండే వ్యక్తులు  ఎంత సమర్ధులు అయినప్పటికీ సంపన్నులు గా కాదుకదా ముషులు అని అనిపించుకోవడానికి  కూడా పనికి రారు.

అదేవిధంగా జీవితంలో చేసిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చు కోలేని వ్యక్తులు కూడా ఎంత ప్రయత్నించినా సంపన్నులు కాలేరు. అంతేకాదు ఏదైన ఒక విషయం గురించి  లేదాడబ్బు సంపాదించడం మీద విపరీతమైన మోజు ను ఏర్పరుచుకునే వ్యక్తి కూడసంపన్నుడిగా కాలేడు  .

ముఖ్యంగా సంపన్నుడు గాఉండాలి అన్న లక్ష్యం తో ముందడుగు వేసే వ్యక్తి  ప్రధమం గా తనలో ఉన్న లోపాన్ని తెలుసుకోగలిగి ఉండాలి . తన లోపాలకు సంబంధించిన పరిష్కారాలు తనకు తాను తెలుసుకున్న లేదా ఇతరులు సూచించి నప్పుడు తెలుసుకున్న  వ్యక్తులు కూడా సంపన్నులు అవగలుగుతారు. ఇతరుల  నుండి  సానుభూతి పొందడం  కోసం తమ కష్టాలను ఎదుటి వారు అడిగినా అడగకపోయినా చెప్పుకునే వ్యక్తులు ఎట్టి పరిస్థితులలోను గొప్పవారు కాలేరు. ఇతరులలో నచ్చని విషయాల గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటూ  కాలం వృధా చేసే  వ్యక్తులు కూడ సంపన్నులు కాలేరు.

అదేవిధంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులలో మన సన్నిహితులు ఎవ్వరూ మనలను ప్రోత్సహించే వారు ఎవరు అన్నవిషయం మీద స్పష్టమైన అవగాహన లేకుండా ప్రతి ఒక్కరితోను  గంటల తరబడి మాట్లాడుతూ కాలం గడిపేవారు కూడా గొప్పవారు కాలేరు.చేసే పనిలో పూర్తి స్థాయి అవగాహనా సాధించి..  ఫలితం గురించి ఆలోచించకుండా నిరంతరం పని సక్రమంగా  చేయాలి  అనే  కష్టపడే మనస్తత్వం ఉన్నవారు మాత్రమే సంపన్నులు అవగలుగుతారు.

డబ్బుఉన్నవారు సంపన్నులు కాదు…పైన చెప్పుకున్నసద్గుణాలు ఉన్నవారు అసలైన సంపన్నులు… అదే డబ్బు ఉండి ఈ  లక్షణాలు లేనివాళ్లు ఎప్పుడు పేదవాళ్ళే … మంచి గుణములతో సంపన్నులు అవుతారో … డబ్బు ఉండి పేదవాళ్ళు గా  మిగిలి పోతారో ఎవ్వరికి  వారు ఆలోచించుకోవాలిసిందే… మంచి గుణాలు అలవర్చుకుని వ్యక్తిత్వం లో సంపన్నులు గామారినవారికి సంపాదనతో ధనవంతులు కావడం కష్టం కాదని గుర్తు పెట్టుకోండి…డబ్బున్న విలువ పొందలేని వారు … డబ్బులేక పోయిన ఎంతో విలువ సంపాదించుకున్నవారు మన చుట్టూ అనేక మంది ఉన్నారు … ఎవ్వరి లా బ్రతకాలి అన్నది మన ఇష్టం మీద ఆధార పడి ఉంటుంది .