ప్రతి ఒక్కరూ తమ జీవితం లో శృంగారం ఆనందంగా సాగిపోవాలనే కోరుకుంటారు. ప్రస్తుతం మనకు ఉన్నసమస్యలు పని ఒత్తిళ్లు కారణాల వల్ల జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించడం లేదనే చెప్పాలి.మనం తీసుకునే ఆహారంలో గనుక న్యూట్రీషియన్స్ ఉంటే.. శృంగార జీవితం లో ఎలాంటి లోటు లేకుండా, అందంగా,ఆనందంగా, చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అది ఎలాంటి ఆహారంమో వాటి సంగతులు ఏమిటో చూద్దాం…
అరటిలో ఎక్కువగా ఉండే పొటాషియం పురుషాంగానికి కావాల్సినంత శక్తిని ఇస్తూ,అంగం ఎక్కువ సేపు గట్టిగా ఉండి, త్వరగా వీర్యస్ఖలనం కాకుండా ఉండడానికి అరటిపండు చాలబాగాఉపయోగపడుతుంది.మెగ్నీషియం,బీటా కెరోటిన్, విటమిన్ ఇ కలిగిన అవోకాడోస్ లైంగిక ఆరోగ్యాన్ని కాపాడడం లో చాలా బాగా పనిచేస్తుంది. అల్పాహారంలో అవోకాడోను చేర్చుకోండి చాలా మంచి ఫలితం పొందుతారు. వాల్ నట్స్ తీసుకోవడం వల్ల సెక్స్ కోరికలు బాగా పెరుగుతాయి అని చెప్పవచ్చు. పుచ్చ కాయ సహజ వయాగ్రా గా పనిచేస్తుంది.ఇందులో సిట్రులైన్ అనే సమ్మేళనం ఉంటుంది.
ఇది రక్త నాళాలను సడలించడానికి ,రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది.. రోజు గుడ్లు తీసుకోవడం,ఆరోగ్యకరమైన అంగస్తంభన కలిగిస్తుంది. గుడ్లలో అమైనో ఆమ్లం ఎల్-అర్జినిన్ అంగస్తంభననుమెరుగుపరుస్తుంది.పురుషుల మరియు స్త్రీ ల లైంగిక పనితీరును పెంచడానికి సహాయపడే పదార్థాల్లో చాక్లెట్ కి ప్రధాన పాత్రఉంటుంది. ఇది అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు మరియు కెఫిన్ కలిగి ఉండడం వలన , రక్త ప్రవాహం మరియు లిబిడోను పెంచడానికి సహాయపడుతుంది.
వోట్స్ తో కూడా చక్కని శృంగార సామర్థ్యం కలుగుతుంది.దీనితో తయారు చేసిన పదార్థాలు సెక్స్ సామర్థ్యాన్ని బాగా పెంచడానికి ఉపయోగ పడతాయి. అంగస్తంభన సమస్య గా అస్సలు ఉండకూడదు అంటే, వోట్స్ తో తయారు చేసిన అల్పాహారం తప్పని సరిగా తీసుకోవాలి.