మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు కారణంగానే చాలా మంది మరణిస్తున్నారు. మనం తినేవి లేదా త్రాగేవి మన గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే వీలయినంత వరకు అలాంటి ఆహారపదార్ధాలకు దూరంగా ఉండాలి.అలాగే మరికొన్ని. ఆహార పదార్ధాలను మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే అవి గుండెపోటు, గుండె జబ్బులు వంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షించగలవు.మరి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఆహారాల గురించి తెలుసుకుందాం.
బ్లాక్ బీన్స్:
బ్లాక్ బీన్స్ లో ఫోలేట్, మెగ్నీషియం, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి బ్లాక్ బీన్స్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.ఇవి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
సాల్మన్ చేప:
ఒమేగా 3 ఆసిడ్స్ సమృద్ధిగా ఉన్న సాల్మన్ ఫిష్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.అలాగే రక్తపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.అందుకే రోజువారీ ఆహారంలో సాల్మన్ చెపలను ఆహారంలో. భాగంగా చేసుకోవాలి.
ఆలివ్ ఆయిల్:
ఆరోగ్యకరమైన కొవ్వు ఆలివ్ నూనెలో ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను రక్షించడంలో, గుండె పోటును నిరోధించడంలో సహాయపడుతుంది.
బాదం పప్పు :
రోజు ఉదయాన్నే బాదంపప్పు తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.బాదం పప్పులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.