ఈ రోజుల్లో చాలామంది దంపతులు కి సంతానలేమి పెద్ద సమస్య గా మారింది. దీని పరిష్కారం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం మందులే కాదు కొన్ని ఆహార పదార్థాల తో కూడా ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చని అంటున్నారు వైద్యునిపుణులు. సంతానలేమి సమస్య అనేది స్త్రీ కి లేదా, పురుషుడికి ఎవరికైనా ఉండొచ్చు. చాలా సందర్భాల్లో స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కారణం గానే ఈ సమస్య ఎదుర్కొవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి వచినప్పుడు ఆహారపు అలవాట్లలలో మార్పు చేసుకోవడం, వ్యాయామం చేయడం తో పాటు, కొన్నిప్రత్యేక పదార్థాలను రోజువారీ తీసుకునే ఆహారం లో ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం…
సహజం గా రుత సమస్యలు ఉన్న స్త్రీలు గర్భ సమస్య లను ఎక్కువగా ఎదురుకుంటుంటారు. ఇలాంటి వారికి అరటిపండు అద్భుత ఔషధం గా పనిచేస్తుంది. ఇందులో ఉండే బి6 సమస్య ను దూరం చేయడానికి బాగా ఉపయోగపడడం వలన త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం లో ఆకుపచ్చని కూరగాయలు చేర్చుకోవడం వల్ల ఐరన్, ఫోలిక్ యాసిడ్, పుష్కలం గా లభిస్తుంది. దీని వల్ల గర్భధారణ సమస్య లు తగ్గుతాయని నిపుణులుసూచిస్తున్నారు. బ్రొకొలీ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండి పోషకాలు అత్యధికం గా ఉండడం వల్ల బ్రొకొలీ గర్భం దాల్చాలనుకునే వారికి ఒక మంచి ఆహారం గా చెప్పొచ్చు. అందుకే వీటిని ఆహారం లో చేర్చుకోవడం చాల ముఖ్యం.
దానిమ్మ పండులో శృంగారానికి సంబందించిన హార్మోన్స్ని పెంచే శక్తి ఉంటుంది. వీటిని గింజలు తినడం లేదా రసం గా తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగి శృంగారం పట్ల ఆసక్తి పెరిగేలా చేస్తుంది. పాలకూర సంతాన సాఫల్యత మెరుగుపరచడం లో మంచి పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన విటమిన్స్ కోరికలను పెంచడం లో బాగా ఉపయోగపడతాయి. గుమ్మడి గింజల్లో ని ప్రత్యేక పదార్థాలు మగవారిలో కోరికలను పెంచడం లో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ విషయం అనేక పరిశోధనల్లో కూడా తేలింది . కాబట్టి పిల్లలు కావాలనుకునేవారువీటిని నానబెట్టుకుని లేదా నేరుగా అయినా తినవచ్చు అంటున్నారు నిపుణులు.