థైరాయిడ్ తగ్గాలంటే వీటిని తినండి!!

థైరాయిడ్‌ నేడు అనేక మందిని వేధిస్తున్న సమస్య. ముప్పయేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్‌ అనేది ఒక హార్మోన్. ఇది ఎక్కువైనా, తక్కువైనా సమస్యగా మారుతుంది . సరైనా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడొచ్చు.

థైరాయిడ్ తగ్గాలంటే వీటిని తినండి!!

థైరాయిడ్ సమస్య తో బాధ పడుతున్న వారు  కొన్ని పదార్దాలను అధికం గా ఆహారం లో తీసుకోవాలి. పెరుగు లో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ ఎక్కువగా  ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి ని సక్రమం గా  పని చేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి లో వచ్చే అసమతుల్యతలు తగ్గిపోతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపల్లో బాగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను  క్రమబద్దీకరిస్తాయి. చేపలను ఆహారం లో ఎక్కువగా తీసుకోవడం వలన కూడా  థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

యాంటీ ఆక్సిడెంట్లు  గ్రీన్ టీ లోపుష్కలంగా లభిస్తాయి.  దీని వలన కొవ్వు కరుగుతుంది.ఆ కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది. ఈ రకంగా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడొచ్చు. మన శరీర మెటబాలిజాన్ని రెగ్యులరైజ్ చేసే విటమిన్లు, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు కోడి గుడ్ల లో ఉంటాయి. కాబట్టి తరచూ కోడి గుడ్లను తింటూ ఉండాలి.నీరు ఎక్కువవుగా తాగడం వలన  హైడ్రేట్ అవడానికి మరియు లోపల ఉండి పోయిన విషాన్ని బయటకు పంపడానికి బాగా సహాయపడతాయి.  అయోడిన్ ఎక్కువగాలభించే రొయ్యలు,   చేపలు, పాలకూర, వెల్లుల్లి, నువ్వులు వంటి వాటిని ఆహారం లో భాగం చేసుకోవాలి. తద్వారా థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది.