ఎప్పుడైనా ఒకసారి ఆకలిగా లేకపోవడం పెద్దగా పట్టించుకో అవసరం లేదు. కానీ రోజు అలానే ఉంటే మాత్రం నెమ్మదిగా జీర్ణ వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.ఆకలి వేయపోవడానికి ప్రధాన కారణం జీర్ణక్రియ లో లోపం ఉండడం. కాబట్టి ఆకలి లేని వారు ఈ చిట్కాలు పాటిస్తే ఆకలి పెరుగుతుంది.
జీర్ణక్రియ ను వేగవంతం చేయడంలో నిమ్మరసం బాగా పని చేస్తుంది. ఆకలి మందగించినపుడు నీళ్లలో కాస్త నిమ్మ రసం పిండి, కొద్దిగా తేనె కలిపితాగండి. ఖర్జూరాల లో పోషక విలువులు మెండుగా ఉండడం తో పాటు ఆకలి ఎక్కువగా పెంచే గుణం ఉంటుంది.
అజీర్తి కి, వికారాని కి , అల్లం బాగా ఉపయోగపడుతుంది . రోజూ నాలుగైదు అల్లం ముక్కలను బుగ్గన పెట్టుకుని నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వలన ఆకలి పెరుగుతుంది .
మెంతులు కడుపులో గ్యాస్‌ను తగ్గించడం లో బాగా పని చేస్తాయి. రోజూ తేనె తో మెంతు ల పొడిని కలిపితీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
ద్రాక్ష విటమిన్ సి ని కలిగి ఉంటుంది. అది జీర్ణక్రియ ను సాఫీగా జరిగే లాగ చేస్తుంది. భోజనం చేసిన ఒక గంట తర్వాత కొన్ని ద్రాక్షపళ్లు తింటే త్వరగా జీర్ణమవుతుంది.
రోజూ మొదటి ముద్ద లో శొంఠి పొడిని కలుపుకుని తినడం, లేదా శొంఠి కాఫీ వంటివి తాగడం అలవాటు చేసుకుంటే, అది కడుపులో గ్యాస్ ని తగ్గించి ఆకలిని పెంచుతుంది. అలానే ఆకలి బాగా వేసిన సమయంలో ఒకేసారి అధిక మోతాదు లో తినకుండా, కొద్ధి కొద్దిగా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకుంటే, అది మన శరీరానికి బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు .
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.