NewsOrbit
హెల్త్

కాన్సర్‌ నుండి కాపాడే ఫుడ్స్!?

కాన్సర్‌ నుండి కాపాడే ఆహార పదార్ధాలు ఏమైనా ఉన్నాయా? లేవన్నదే ఈ ప్రశ్నకు సమాధానం. అయితే కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే ఆహార పదార్ధాలు మాత్రం కొన్ని ఉన్నాయి. కాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం ఉన్న ఆహార పదార్ధాలు ఏమిటో, వాటికి ఆ గుణం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.

యాపిల్స్: ఈ పండులో పోలీఫెనాల్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్‌, గుండె సంబంధ వ్యాధులను తగ్గించే గుణం పోలీఫెనాల్స్‌కు ఉంది. వీటికి యాంటీ కాన్సర్ గుణాలు కూడా ఉన్నట్లు ఇటీవలి పరిశోధనలో బయటపడింది.

బెర్రీ పండ్లు: బెర్రీల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు ఎక్కువగా ఉంటాయి. ఈ పళ్లకు యాంటాక్సిడెంట్ గుణాలు ఎక్కువ. బ్లాక్ బెర్రీల్లో ఉండే యాంథోసయానిన్ అనే జీవ రసాయనం పెద్దపేగు కాన్సర్‌ విషయంలో పని చేస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. బ్లూ బెర్రీలకు బ్రెస్ట్ కాన్సర్‌ను నిరోధించే గుణం ఉన్నట్లు కూడా తేలింది.

క్రూసిఫెరస్ కాయగూరలు: బ్రొకోలీ, కాలిఫ్లవర్ వంటి కాయగూరలు ఈ కుటుంబానికి చెందినవి. వీటిల్లో విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్ ఎక్కువగా లభిస్తాయి. వీటిల్లో సల్ఫోరాఫేన్ అనే ఒక రసాయనం ఉంటుంది. దానికి కాన్సర్ పెరుగుదలను నిరోధించే గుణం ఉన్నట్లు బయటపడింది. ఈ సల్ఫోరాఫేన్, సోయాబీన్స్‌లో ఉండే మరో రసాయనం జెనిస్టీన్ కలిసి బ్రెస్ట్ కాన్సర్‌ పెరుగుదలను అరికట్టగలవని పరిశోధనల్లో తేలింది.

క్యారట్: వీటిల్లో విటమిన్ కె, విటమిన్ ఎ, యాంటాక్సిడెంట్లు ఉంటాయి. క్యారట్‌కు ఆ ఆరెంజ్ రంగును ఇచ్చే బీటాకెరొటీన్ రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది. కొన్ని రకాల కాన్సర్‌లను కూడా ఇది నిరోధించగలదని ఇటీవలి పరిశోధనల్లో తెలిసింది. బ్రెస్ట్, ప్రోస్టేట్ కాన్సర్‌ల విషయంలో బీటాకెరొటిన్ ప్రభావం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

చేపలు: సాల్మన్, మాకరెల్, యాంఖోవీస్ వంటి కొవ్వు చేపల్లో విటమిన్ బి, పొటాసియం, ఒమేగా 3 కొవ్వులు ఉంటాయి. మంచినీటి చేపలు ఎక్కువగా తీసుకునే వారికి పెద్దపేగుల కాన్సర్ వచ్చే అవకాశం తక్కువని ఒక అధ్యయనంలో బయటపడింది.

ఆక్రోటు (వాల్‌నట్): అన్ని రకాల నట్స్‌కూ  ఎంతో కొంత కాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. అయితే ప్రత్యేకించి వాల్‌నట్‌లో ఈ గుణాలు ఎక్కువ ఉన్నట్లు ఇటీవల తెలిసింది. వాల్‌నట్‌లో ఉండే పెడుంక్యులాజిన్ అనే రసాయనం బ్రెస్ట్ కాన్సర్‌ను నిరోధించగలదని పరిశోధనల్లో తేలింది.

లెగ్యూమ్ కుటుంబం కాయ ధాన్యాలు: బీన్స్, బఠాణీ, పెసలు అలసందలు, ఉలవల వంటి కాయధాన్యాలు కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవని తెలిసింది. వీటిల్లో పీచు పదార్ధాలు ఎక్కువ.

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment