మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు, మిటమిన్లు సమృద్ధిగా అందాలి. ముఖ్యంగా మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్‌లో హీమోగ్లోబిన్, మయోగ్లోబిన్ అనే రెండు ప్రోటీన్లుంటాయి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే, దీని కోసం మనం ఐరన్ అధికంగా ఉండే ఆహార పదర్ధాలు తీసుకోవాలి.
చాలా మంది మాంసహారంతోనే ఐరన్ అభిస్తుందని పోరబడుతుంటారు. కానీ శాఖాహారంలోనూ ఐరన్ అధికంగానే ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనవి ఆకుకూరలు. ఆకుపచ్చ కూరగాయాలు, ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పాలకూరలో ఐరన్ అధికస్థాయిలో ఉంటుంది. దీనిని తరచూ తీసుకోవడం ద్వారా శరీరానికి పుష్కలంగా ఐరన్ అందుతుంది. అలాగే, బచ్చలికూరలోనూ ఐరన్ అధికంగానే ఉంటుంది. 100 గ్రాముల బచ్చలి కూరలో 2.7 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది.
కాయ ధాన్యాల్లోనూ ప్రొటీన్లతో పాటు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, ఉల్లికాడలు, బీన్స్‌లోనూ ఐరన్ ఉంటుంది. ఒకకప్పు కాయ ధాన్యాల్లో 6.6 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. మన శరీరానికి నిత్యం కావల్సిన ఐరన్‌లో 25 శాతం ఐరన్‌ను టమాటాలను తినడం వల్ల పొందవచ్చు. బ్రొకొలి, పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్, పల్లీల్లోనూ ఐరన్ ఉంటుంది. అలాగే, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, నువ్వు గింజల్లోనూ ఐరన్ అధికంగానే ఉంటుంది.
కొన్ని రకాలైన పుట్టగొడుగులలోనూ ఐరన్ ఉంటుంది. అయిస్టర్ పుట్టగొడుగుల కంటే బటన్ పుట్టగొడుగులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ బీన్స్ లోనూ ఐరన్‌తో పాటు ప్రొటీన్లు కూడా అధికంగానే ఉంటాయి. అలాగే ఓట్స్ లోనూ ఐరన్ ఉంటుంది. కోకా కంటెంట్ కలిగిన ప్రతి 28 గ్రాములు కలిగిన డార్క్ చాక్లెట్లో 3 మిల్లీ గ్రాముల వరకూ ఐరన్ ఉంటుంది. ఈ ఆహార పదర్ధాలను నిత్యం తీసుకోవడంతో శరీరానికి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.