డాన్స్ అంటే కేవలం సినిమా లకి , షోలకి సంబంధించిన విషయం కానే కాదు.అది ఒక అద్భుతమైన కళ. అది ఒక వ్యాయామం కూడా. శరీరం దృడం గా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది ఏదో పండుగకో..శుభ కార్యాని కో ఆనందంగాఉన్నప్పుడో డాన్స్ చేస్తుంటారు . అయితే ఆనందం గా ఉన్నప్పుడు డ్యాన్స్ చేయడం కాదు,ప్రతి రోజు డ్యాన్స్ చేస్తే ఆనందంగా ఉంటారు.డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి అవయవం, కండరం కదులుతాయి.
వ్యాయామానికి బద్దకించే శరీరం కాస్తా,డాన్స్ చేస్తే కొత్త ఉత్సాహం తో గంతులేస్తుంది.. ఈ డాన్స్ కారణం గా శరీరంలో ని కేలరీలు ఖర్చుచేయగలుగుతాము . దాని ఫలితంగా బరువు తగ్గడం,బిగుసుకున్న కండరాలువిశ్రాంతిని పొంది మనసు ప్రశాంతం గా మారుతుంది.. అంతేకాదు, గుండెకు , ఊపిరితిత్తులకు వచ్చే సమస్య ల ను నియంత్రించడం లో డ్యాన్స్ బాగా పనిచేస్తుంది.రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలనుకున్నవారిలో చాలామంది డ్యాన్స్‌కే ప్రాధన్యత ఇస్తున్నారని చాలా పరిశోధనల్లో బయట పడింది.
డాన్స్ చేయడం అంటేఆనందాన్ని పొందుతూ వ్యాయామం చేయడం అని అర్ధం.ఏరోబిక్స్, జుంబా, ఇలా ఏదైనా సరే డ్యాన్స్‌తో నే ముడి పడి ఉంటుంది. మ్యూజిక్ వినడం, దానికి తగ్గట్లు శరీరాన్నిలయబద్దంగా కదిలించడం కూడా శరీరానికి ఉత్సహాన్ని ఇచ్చే పనులే..డాన్స్ చేయడంవలన శరీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం కూడా మీసొంతమవుతుంది. కండరాలను , ఎముకల ను బలంగా చేయడం, శరీరాన్ని దృఢం గా ఉంచడం, డ్యాన్స్ వల్ల వచ్చే లాభాలు.. డ్యాన్స్ అంటే మనకి సంబంధించినది కాదు, వాళ్ళేమనుకుంటారో ,వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించకుండా.. వ్యాయామం అంటే ఇష్టపడని వారంతా చక్కగా డాన్స్ చేసేయొచ్చు. అయితే డాన్స్ చేయడానికి మంచి శక్తి కావాలి కాబట్టి పోషకాహార తీసుకోవడం,డాన్స్ కి ముందు శరీరాన్ని నెమ్మది గా అటు ఇటూ కదుపుతూ శరీరాన్ని సిద్ధం చేయడం అనేది చాల అవసరం అని మరిచిపోవద్దు.