రెట్టించిన ఉత్సహం తోవ్యాయామం చేయాలంటే ఇది  ఫాలో అవ్వండి!!

వ్యాయామం చేయడం వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి . ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు  చిన్న,పెద్ద అన్న తేడా  లేకుండా వ్యాయామం చేస్తున్నారు. వ్యాయామం చేయడం  వల్ల హార్మోన్స్ బాగా పనిచేస్తాయి. మృతకణా లు పేరుకోకుండా ఉంటాయి. చర్మం తాజాగా ఉంటుంది .శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది.చిన్నప్పటి  నుండే వ్యాయామం చేసే అలవాటు ఉండడం  వలన భవిష్యత్తు లో  రక్తపోటు, మధుమేహం,  ఊబకాయం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
రెట్టించిన ఉత్సహం తోవ్యాయామం చేయాలంటే ఇది  ఫాలో అవ్వండి!!
కాబట్టి దృఢం గా ఉండాలంటే వ్యాయామం చేస్తుండాలి. అయితే కేవలం  దృఢం గా ఉండడానికే కాదు..ఆరోగ్యంగా ఉండాలన్నా వ్యాయామం చేస్తుండాలి. రోజూ వ్యాయామం చేయడం అనేది మాత్రమే ముఖ్యం కాదు,ఎంత బాగా చేస్తున్నామన్నది కూడా ముఖ్యమే. అదేవిధంగా  వ్యాయామం చేస్తున్నాం అన్నపేరుకు మాత్రమే కాకుండా  మనసు పెట్టి ఎక్కువ సేపు చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయాలంటే వ్యాయామం కి  సరిపోయే శక్తి మనశరీరంలో ఉండాలి.దానికిసరిపోయే ఆహారం తీసుకుంటేనే అందుకు  సరిపడా  శక్తి  మనకి లభిస్తుంది. కాబట్టి.. వ్యాయామం చేసే 30 నిమిషా ల ముందు ఒక అరటిపండు కానీ  కొన్ని  ఖర్జూరాలు కానీ తినడం వలన వెంటనే శక్తి వస్తుంది.

సరిపడా శక్తి ఉండడం వలన ఎంతసేపు వ్యాయామం చేసినా కూడా అలసట రాదు. అదేపనిగా  వ్యాయామం చేయకుండా మధ్య మధ్య లో కొన్ని నీళ్లు తాగు తుండాలి.అదేవిధంగా,వ్యాయామం పూర్తి అయిపోయాక మరో 30నిమిషాలు పాటుఆగి బాదం, అరటిపండు, మిల్క్ షేక్, అక్రోట్స్, మొలకలు లాంటివి తీసుకోవడం మంచిది. దీనితో  శరీరానికి తిరిగి శక్తి వస్తుంది. నీరు కూడా ఎక్కువగాతాగాలి . అప్పుడే శరీరం నుంచి చెమట రూపం లో బయటకు పోయిన నీటిని  తిరిగి శరీరానికి అందించగలం.ఈ విధంగా వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం కూడా కలుగుతుంది.