NewsOrbit
హెల్త్

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న మీ ఫ్రెండ్స్ , ఫామిలీ కి ఈ న్యూస్ షేర్ చేయండి..

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న మీ ఫ్రెండ్స్ , ఫామిలీ కి ఈ న్యూస్ షేర్ చేయండి..

పోషకాహార లోపానికి గురైన పిల్లలు శారీరకపరమైన, మరియు మానసిక పరమైన  సమస్యలకు గురవుతుంటారు. పిల్లలలో ఎదుగుదల సరిగా లేకపోవడం, చెప్పింది విని అర్థం చేసుకొనే శక్తి తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. వీటితో పాటు జబ్బులను ఎదుర్కొనే శక్తి లోపించడం వల్ల ఎప్పుడు ఎదో ఒక వ్యాధులకు గురి అవుతూ ఉంటారు.పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు ఉండడం చాల ముఖ్యం. సమయానికి ఆహారం, నిద్ర వంటి చక్కని  అలవాట్లు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న మీ ఫ్రెండ్స్ , ఫామిలీ కి ఈ న్యూస్ షేర్ చేయండి..

చిన్నతనం లో పోషకాహారలోపం ఉన్న పిల్లలకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు, భవిష్యత్తులో చదువు కుసంబందించిన సవాళ్లు మరియు కొంచెం పనిచేసిన అలసి పోవడం వంటి వాటికీ కారణమవుతుంది.పిల్లలకు ప్రతి నాలుగు గంటలకోసారి తినడానికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇందులో  భోజనంమూడు సార్లు, చిరుతిళ్ళు నాలుగుసార్లు ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలి. ఆహారం లో  పండ్లు,కాయగూరలు, ఇవ్వడం నెమ్మదిగా పెంచితే వారి ఎదుగుదలకి అవసరమైన అన్ని పోషకాలు బాగా అందుతాయి.

క్షణం తీరిక లేని ఈ రోజుల్లో చాలా మంది బయట దొరికే జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు.ముఖ్యంగా పెద్ద పెద్ద మెట్రో నగరాలలో నివసిస్తున్న ప్రజలు వాళ్ళ తీరిక లేని పనివేళ్ళల కారణం గా ఇంట్లో వంట చేసుకోవడానికి ఓపిక లేక బయట అమ్మే చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డారు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల పౌష్ఠిక ఆహార లోపం తో పాటు అనారోగ్యాల కి గురి  అవుతున్నారు. ఈ ఆహరం పెద్దవాళ్ళు తీసుకోవడమే కాకుండా తమ పిల్లలకి కూడా పెట్టి వారిని కూడా చిన్న వయసులో ఆసుపత్రుల పాలు చేస్తున్నారు.

ఇకనయినా ఈ అలవాట్లు వదిలేయండి.. చిన్న పిల్లలకి కావాల్సిన పోషకాహారాలను కచ్చితంగా వారి ఆహారం లో ఉండేలా చూస్తూ మీరు కూడా అలాంటి ఆహారమే తినండి. పౌష్ఠికఆహారం తో పెరిగిన వారు ఎలాంటి పరిస్థితులని అయినా ఎదుర్కొవడానికి సిద్ధం గా ఉంటారని మరువకండి. ఇక్కడ కొన్ని ఆహారాలు చెప్పడం జరిగింది.అవి మీ కుటుంబం తీసుకునే ఆహారం లో ఉండే విధం గా చూసుకోండి. బ్రోకలీ ని మీరు, మీ పిల్లలు ఆహారంలో తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి మీకు, మీ పిల్లలకు భవిష్యత్ లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.

పిల్లలకు చిరుతిండి గా నట్స్ ని తినడం అలవాటు చెయ్యండి. వీటిల్లో శరీరానికి  కావాల్సిన విటమిన్ -ఈ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి శరీరానికి ఇమ్మ్యూనిటీ  బూస్టర్ గా, యాంటీ ఆక్సిడెంట్లగాను ఉపయోగపడతాయి. నిమ్మ జాతి పండ్లలో లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. వైరస్, బాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి చిన్న పిల్లలకి రోజు ఈ  పండ్లను ఇవ్వండి.

బాదం లో విటమిన్ ఈ ఉండడం వలన రోగ నిరోధక శక్తి ని పెంచి  పిల్లలకు భవిష్యత్ లో సంతాన లోప సమస్యలు రాకుండా రక్షణ ఇస్తుంది . నానా బెట్టి తొక్కు తీసిన బాదం పప్పు తినడం అలవాటు చెయ్యండి. పిల్లలు మనము చెప్పింది చెయ్యరు … మనము చేసిందే చేస్తారు … కాబట్టి పోష్టికాహారం ముందు మీరు తీసుకుంటూ వారికీ అలవాటు చేసి వారికి బలమైన  భవిష్యత్తు ను  ఇవ్వండి .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri