హెల్త్

బరువు తగ్గాలంటే మెంతులను ఉపయోగించాలిసిందే..!!

Share

ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు చేయడం, డైటింగ్ చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం శున్యం అనే చెప్పాలి. అయితే మేము చెప్పే వంటింటి చిట్కాలు పాటించడం వలన మీ శరీరం యొక్క బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా..ఈ వెయిట్ లాస్ టిప్స్ పాటించడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. బరువు తగ్గడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి..

మెంతుల వలన కలిగే ఉపయోగాలు :

మెంతులు తినడం ద్వారా శరీర బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.మెంతి గింజల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి.మెంతుల్లో ఫైబర్ శాతం కూడా అధికంగా ఉండడం వలన బరువు త్వరగా తగ్గడంతో పాటుగా జీర్ణ శక్తిని కూడా మరింత మెరుగుపరుస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగుల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంటాయి బరువు తగ్గాలని భావించేవారు రాత్రి వేళ నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీటిలో కొన్ని మెంతి గింజలు వేసి రాత్రంతా నానా బెట్టుకుని పొద్దునే ఆ నీటిని వడగొట్టుకుని తాగితే మంచిది.

మెంతులతో బరువు తగ్గడం ఎలా?

అలా కాకుండా కొన్ని నీటిలో మెంతులను వేసి నీటిలో మరిగించి అయినా తాగవచ్చు.ఇలా చేస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరుగడంతో పాటు మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. మెంతులతో టీ పెట్టుకుని తాగిన మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొక చిట్కా ఏంటంటే ఒక చెంచా మెంతులు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లాన్ని నీటిలో వేసి మరిగించి, వడకొట్టి తాగడం వలన బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది.


Share

Related posts

ఇంట్లో ఎండల తో వచ్చే వేడి తగ్గాలంటే ఇలా చేయండి!!

Kumar

Garlic: రోజూ ఆ టైమ్‌లో వెల్లుల్లి తింటే బ‌రువు త‌గ్గుతారు..తెలుసా?

kavya N

Sleep: గాఢనిద్ర కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..!!

bharani jella