29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
హెల్త్

Gastro Obscura: ఒక్క మామిడి చెట్టుకు 300 రకాల పండ్లు.. మీరే చూసేయండి..!

Gastro Obscura man single mango tree 300 fruits
Share

Gastro Obscura: మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. కానీ ఫలాలలో రాజుగా చూసే మామిడిలో ఒక రకం కాదు. ఎన్నో రకాల పండ్లు మార్కెట్లో దొరుకుతాయి. ఆ విషయం అందరికీ తెలుసు.కానీ ఒకే చెట్టుకు వంద రకాల మామిడికాయ పండ్లు కాస్తున్నాయంటే ఎవరైనా నమ్ముతారా..? నమ్మాలి తప్పదు. ఉత్తర ప్రదేశ్ లో అలాంటి మామిడి చెట్టును పెంచి పండ్లు అమ్ముతున్నాడు ఓ రైతు.. అసలు ఒక చెట్టుకు మూడు వందల రకాల మామిడి పండ్లు కాయడం ఏమిటో? అది “మామిడి వృక్షం కాదు మహావృక్షం”

Gastro Obscura man single mango tree 300 fruits
Gastro Obscura man single mango tree 300 fruits

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి కొన్ని కిలోమీటర్ల దూరంలో మలిహాబాద్ కూడలికి సమీపంలో ఓ మామిడి చెట్టు తోట ఉంది.నాలుగు ఎకరాల మామిడి తోటలో ఒక మామిడి చెట్టు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో 3 కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లు పండే చెట్టు అది కావడం విశేషం.. ఎలా అంటే ఆ చెట్టుకు కాసే ప్రతి మామిడికాయ రంగు,రుచి సైజులో పూర్తిగా భిన్నంగా ఉంటాయి. 83 ఏళ్ల వృద్ధుడు ఆ చెట్టును ప్రస్తుతం సంరక్షిస్తున్నాడు..

ఒకే చెట్టుకు 300 రకాల పండ్లు:
అరుదైన మామిడి పండ్లు కాస్తున్న ఒకే చెట్టును పెంచుతున్న రైతు హజీ కలీం 17 ఏళ్ల వయసులో మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకోవడంతో తండ్రితో నర్సరీలో పనిచేస్తూ అంటుకట్టు విధానం ద్వారా ఒకే మొక్క నుంచి వేరువేరు రకాల పండు ఎలా ఉత్పత్తి చేయవచ్చని విషయంపై పరిశోధన చేశాడు. మొదటిసారి అంటుకట్టు విధానం ద్వారా చెట్టును పెంచాడు. ఆ చెట్టుకు ఏడు రకాల మామిడి పండ్లు కాసాయి. కానీ అతివృష్టి కారణంగా ఆ చెట్టు దెబ్బ తినడంతో తర్వాత 1987లో మళ్లీ ఆ చెట్టును పనిచేశాడు.

అదేవిధంగా ఆ చెట్టును అనేకసార్లు అంటుకట్టు విధానంతో పెంచుకుంటూ.. ఇప్పుడు మహావృక్షంగా మార్చాడు. ఈ అతిపెద్ద మామిడి చెట్టు నుంచి 300 రకాల పండ్లు కొన్ని వేల పండ్లు వస్తున్నాయి.ఈ అద్భుత చెట్టు రహస్యాన్ని తెలుసుకోవడానికి జపాన్ బృందం కూడా ఇక్కడికి వచ్చి వారి సమస్యలు ఈ చెట్టును పెంచే కళ గురించి వారి నుండి సమాచారం తీసుకుంటే ఇంతటి అద్భుతమైన చెట్టును సంరక్షిస్తున్నందుకు అతనిలో అద్భుతమైన పనితీరును ప్రశంసిస్తూ 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పద్మశ్రీ అవార్డును అందజేశారు.


Share

Related posts

టమోటాలకూ ఐరన్‌కూ చుక్కెదురు!

Siva Prasad

వివాహం లో చేసే గౌరీ పూజ వెనుక ఉన్న రహస్యం మీకోసం!!

Kumar

Children : పిల్లల  పుట్టాలని  లక్షలు ఖర్చు పెట్టి విసిగిపోయారా? ఆఖరి ప్రయత్నం గా ఈ  జ్యూస్ ట్రై  చేయండి అద్భుతం చూస్తారు!!

siddhu