ఇంటిలో సాలీళ్ల సమస్య కు తేలికైన పరిష్కారం??

సాలీళ్ల వలన మనకు ఏ హానీకలుగదు. అలాగని వాటిని మన ఇళ్ల లో ఉండనిస్తే  ఇల్లంతాపాడు బడినట్టు చేసేస్తాయి.  ఎక్కడ పడితే అక్కడ గూడు కట్టేసి ఇంటీరియర్‌ను పాడుచేసేస్తాయి. అందువల్ల సాలీళ్ళ ను ఇంటిలో లేకుండా చూసుకోవాలి.వాటిని వెళ్లగొట్టేందుకు  ఎలాంటి పురుగు మందులు వాడకూడదు. అలా చేస్తే, వాటికి హాని చేసినట్లవుతుంది. అలాగే ఆ పెస్టిసైడ్స్ వాసనలు, పిచికారీలు వంటివి చేయడం వలన మనకు వికారం లేదంటే ఏదైనా ప్రమాదం కలిగించవచ్చు.

ఇంటిలో సాలీళ్ల సమస్య కు తేలికైన పరిష్కారం??

అందువల్ల కొన్ని ప్రత్యేక పద్దతుల తో చాలా తేలిగ్గా, వాటిని బయటకు పంపేయవచ్చు.అలా జరగడానికి  ఏమి  చేయాలో తెలుసుకుందాం. ఓ కప్పు నీటీలో  ఓక కప్పు తెల్లటి వెనిగర్ కలిపి ఇంటిలో ఎక్కడ సాలీ గూళ్లు కడుతున్నాయో… అక్కడ పిచికారీ చేయాలి.వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉండడం వలన  దాని వాసన చూస్తే చాలు సాలీడు కి చిరాకొస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఇంట్లోంచీ పారిపోతుంది. నారింజ తొక్కలు, పుల్లటి కమలాలు, వంటివి సాలీళ్లపై బాగా పనిచేస్తాయి. ఎక్కడ సాలీళ్లు ఉన్నాయో  అక్కడ ఈ తొక్కల తో రుద్దితే, ఆ తర్వాత నుంచి చూద్దామన్నా సాలీళ్లు కనిపించవు. అంతగా పారిపోతాయి.

పుదీనా ఉంటే చాలు సాలీళ్లుపారిపోతాయి దాని వాసన అంటే సాలీళ్లకుభయంకరం గా అనిపిస్తుంది. అసలు సాలీళ్ల కాళ్లకే  రుచి నాళాలు ఉంటాయట. కాళ్లే రుచి చూడగలవు. ఇంట్లో పుదీనా తో ఏదైనా  తయారుచేసుకున్నారంటే చాలు సాలీళ్లన్నీ ఏదో ఒక దారి నుండి  బయటకు పారిపోవాలని చూస్తాయి.ఇన్ని చేసినా తర్వాత  కూడా సాలీళ్లు ఉన్నాయంటే, ఓక  నిమ్మకాయ ను కోసి,అందులో రసాన్ని నీటి లో పిండి  ఆ నీటిని స్ప్రే బాటిల్ లో పోసుకుని  ఇంట్లో  కిటికీలు, తలుపులు పై  అన్ని మూలల పిచికారీ చేస్తే ఇక సాలీళ్ల సమస్య అనేది ఉండదు.

పొగాకు వాసనను  కూడా సాలీళ్లు అస్సలు భరించలేవు. ఇంట్లో ఎక్కడ సాలీళ్లు ఎక్కువగా గూడు కడుతున్నాయో అక్కడ ఓ సిగరెట్‌ను ముక్కలు చేసి,అందులో ఉండే  పొగాకునుచల్లితే సాలీళ్లు పారిపోతాయి. అలా కాదనుకుంటే పొగాకును కాసేపు నీటిలో నానబెట్టి ఆ నీటిని చల్లినా సమస్య తీరిపోతుంది. మనం ఏమిచేసినా  సాలీళ్లు ఇంటిలోనుండి బయటకు పోయి చెట్ల మీద చేరుతాయి .. కానీచనిపోయేలా చేస్తే మాత్రం పర్యావరణానికి హాని చేసిన వాళ్లం అవుతాం. కాబట్టి పైన చెప్పిన పద్ధతులు చేయడం వలన మన సమస్యతీరడం తో పాటు అవికూడా సురక్షితం గా ఉంటాయి.

సాలీళ్లు ప్రకృతిని ఎలా కాపాడతాయో తెలుసుకుంటే వాటికి పొరపాటునకూడా హాని జరగకుండా చేస్తారన్న ఉద్దేశ్యం తో ఈ విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది అని గమనించగలరు. సాలీళ్ల లో గూడు అల్లేవి ఒక రకమైతే, నేలపై తిరుగుతుండేవి రెండోరకం. ఈ రెండు రకాల సాలీళ్లూ కీటకాలను నాశనం చేస్తాయి.వ్యవసాయం లో కీటక నాశినుల వాడకం ఎక్కువ అవుతుండటంతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి.ఈ నేపథ్యం లో సాలీడులను సహజసిద్ధ కీటక నాశినులుగా ఉపయోగించాలి కానీ వాటిని నాశనం చేసి పర్యావరణానికి హాని చేయకూడదు.