వంట గదిలో అల్లం లేకుండా అస్సలు ఉండదు.. ప్రతి ఒక్కరు కూరల్లో అల్లం వాడుతూనే ఉంటారు. అల్లం లో లెక్కకి మించి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో అల్లానికి ఉన్న ప్రత్యేకత ఎంతో గొప్పగా తెలియచేసారు. అల్లం ప్రతి రోజు క్రమం తప్పకుండా వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఎన్నెన్నో. వంటకాల్లో అల్లం వేయకపోతే ఎలా అయితే రుచి ఉండదో ఆరోగ్యం విషయం లో కూడా అల్లం తీసుకోకపోతే అలాగే ఉంటుంది.
ఎండాకాలం లో వడ దెబ్బ తగలకుండా ,అల్లం, కరివేపాకు,ముద్దగా చేసుకుని మజ్జిగ తో కలిపి తాగితే శరీరానికి ఉపశమనం గా ఉంటుంది .చాలామందికి ప్రయాణాలు పడవు వాంతులు అవుతూ చాల ఇబ్బందికి గురిఅవుతుంటారు. దీనికి మంచి పరిష్కారం అల్లం తో దొరుకుతుంది అంటున్నారు. ఆయుర్వేద నిపుణులు. అల్లం నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాను సంహరించి, చెడు వాసనని దూరం చేసి దంతాలు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.
అల్లానికి రక్తం లోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడం లో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం యొక్క ప్రాముఖ్యత. రక్త నాళాల్లో రక్తప్రవాహం సరిగా జరిగేలా చేస్తుంది. అల్లం తీసుకోవడం వలన నాళాలు మూసుకు పోవడంఅనేది ఉండదు. ఆస్త్మా, కీళ్ల వాతం, బాధలను అల్లం తగ్గిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనం చేసే ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది. సులభ విరోచనకారి గా కూడా పనిచేస్తుంది . కడుపు ఉబ్బరం లేకుండ చేస్తుంది .