Astrology signs: పుట్టిన ప్రతి ప్రాణి 27 నక్షత్రాలలో,12 రాశులలోనే జన్మిస్తారు. రాశుల స్థితిగతులను బట్టి ఒక వ్యక్తి యొక్క లక్షణాలు,గుణం ,ఇష్టా ఇష్టాలు, భవిష్యత్,ప్రేమ,వృత్తి, సంబంధాలు ,సంపద,భార్య ,పిల్లలు మొదలైనవి జ్యోతిషం ద్వారా అంచనా వేస్తారు.మనిషి మనుగడకు అవసరమైన స్థైర్యాన్ని, భవిష్యత్తుపై నమ్మకాన్ని, జీవితంపై సంపూర్ణ అవగాహనను ఇచ్చే మహోన్నతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం వివాహ సమయంలో అయితే స్త్రీ పురుషుల జన్మ నక్షత్రాన్ని బట్టి వారికి సరైన జోడి పెద్దలు ఎంపిక చేస్తారు. అయితే ఒక్కొక్క రాశిలో పుట్టిన వారికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొందరు బాగా డబ్బు సంపాదిస్తే,మరికొందరు పేరు ప్రఖ్యాతలు పొందుతారు.
మరికొందరు రకరకాల వృత్తులలో రాణిస్తుంటారు. అయితే ఒకే రాశి లో పుట్టిన ఆడవారి స్వభావం మగవారి స్వభావం వేరు వేరు గా ఉంటుంది. అలాగే స్త్రీలు ఎక్కువగా ఆకర్షించడం లో ఈ ఐదు రాశులు చెందిన పురుషులు ముందుంటారని జ్యోతిష్య శాస్త్రం తెలియచేస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
మిథున రాశికి చెందిన మగవారు ఈ విషయంలో ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. వాళ్ళు పెద్దగా కష్టపడకుండానే ఆడవారిని తేలికగా ఆకట్టుకుంటారు. నిజానికి మిథున రాశి వారు సున్నిత మనస్తత్వం తో పాటు మృదు స్వభావం కలవారు కావడంతో స్త్రీలు త్వరగా వీరితో కలిసి పోయి స్నేహం చేస్తారు.
వాళ్లతో మాట్లాడడానికి సౌకర్యం గా అనిపిస్తుంది. అంతేకాదు ఈ రాశికి చెందిన మగవారు,ఆడవారితో ఎలా మాట్లాడాలో వారితో ఎలా ప్రవర్తించాలో బాగా తెలిసి ఉంటారట. అమ్మాయిల మనస్సు అర్ధం చేసుకునే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉండడం వలన వీరిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు.