Girls issue: స్త్రీల కు నెల నెల పీరియడ్స్ రావడం వారి ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే కొన్నిసార్లు ముఖ్యమైన సందర్భాలలో పీరియడ్స్ వస్తే , నొప్పి తో ఏ పని చేయలేక, సతమతం అవవాల్సొస్తుంది. అందుకే శుభకార్యాలు, తీర్థయాత్రలు లాంటివి పెట్టుకున్నప్పుడు స్త్రీలు ఎందుకైనా మంచిదని నెలసరి ఆలస్యం కావాలని టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు.
దీనివల్ల ఆ సమయానికి పని పూర్తి, అయినా ఆ తర్వాత వచ్చే నెలసరి లో మాత్రం హెవీ బ్లీడింగ్, నొప్పి తో బాధ పడాల్సి ఉంటుంది. సహజ పద్ధతులు అనుసరించి కూడా నెలసరి రావడాన్ని వాయిదా వేసుకోవచ్చు. నెలసరి విషయంలో మీకు ఖచ్చితమైన సమయం తెలిసి ఉంటే … పదిహేను రోజుల ముందు నుంచి ఈ పద్ధతులు పాటించి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదెలాగంటే.. నెలసరి ఆలస్యం చేయడంలో బొప్పాయి తినడం బాగా పనిచేస్తుంది.ఇది చాలా సహజ సిద్ధమైన మార్గం అని మరువకండి.
నిమ్మరసం లో విటమిన్లు, సిట్రిక్ యాసిడ్ బాగా దొరుకుతుంది. నెలసరి ముందు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల నెలసరి ఆలస్యంగా వస్తుంది. రుతుస్రావం సమయంలో కూడా నిమ్మరసం తీసుకోవడం వల్ల రక్తస్రావం తగ్గి , నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పీరియడ్స్ కు రెండు మూడు రోజుల ముందు నుంచి నిమ్మరసం తాగడం మొదలు పెడితే పీరియడ్స్ ఆలస్యం గా వస్తుంది. నిమ్మరసం లాగే రాస్ బెర్రీ ఆకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ ఆకుల తో చేసిన టీ తాగడం వల్ల ఇది పీరియడ్స్ ప్రక్రియ నెమ్మదించేలా చేస్తుంది. దీంతో పీరియడ్ లేట్ గా వస్తుంది .