హెల్త్

Born Baby: చంటి  పిల్లలకు 5 వ నెలనుండి సంవత్సరం వరకు ఇలాంటి ఆహారం ఇవ్వండి!! (part-1)

Share

Born Baby:  పిల్లలకు  అయిదు నెలలు వయసు వచ్చిన తరువాత తల్లి  పాలు ఇవ్వడం తో  పాటు సులువుగా  జీర్ణమయ్యే ఆహారాలను  పెట్టడం మొదలు పెట్టాలి. బాగా మెత్తగా  చిదిమిన  అరటి పండు, బాగా ఉడకపెట్టి మెత్తగా  మెదిపిన  క్యారెట్  వంటివి పెట్టవచ్చు.  పిల్లలకు  ఆహారం పెట్టేటప్పుడు ముందు  ఒక స్పూనుడు  మాత్రమే  పెట్టండి  అంతకు మించి  పెట్టవద్దు.   రోజుకి రెండు స్పూన్స్  చొప్పున   నాలుగు రోజుల పాటు  ఒకే రకం   ఆహారం  ( Food )మాత్రమే  ఇవ్వాలి.   ఉదాహరణకి మీరు ఈరోజు పిల్లలకు     అరటి పండు బాగా మెత్తగా చేసి  రెండు స్పూన్స్ పెట్టారు అనుకుందాం.. అలా రోజుకు      రెండు స్పూన్స్  చొప్పున   నాలుగు  రోజుల పాటు అరటి పండు గుజ్జుని మాత్రమే పెట్టండి. ప్రతీ రోజు తాజాగా చేయండి కానీ చేసేసి  ఫ్రిడ్జ్ లో నిల్వ మాత్రం ఉంచకండి.

ఇలా  నాలుగు రోజులు  ఒకే   ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు  ఈ కొత్త ఆహారానికి సరిగ్గా అలవాటుపడుతున్నారా  లేదా  అనేది తెలుసుకోగలుగుతాం.     ఇలా  కొత్తగా అలవాటు చేస్తున్న ఆహారం జీర్ణం కాకపోయినా లేదా ఎలర్జీలు వంటివి వచ్చిన  ఈ మూడు రోజుల్లో మనకి తేడా తెలిసిపోతుంది. ఎలాంటి సమస్య  రాకపోతే  మరొక కొత్త ఆహారం అంటే  క్యారెట్ ఉడకబెట్టి మెత్తగా మెదిపి పెట్టడం  మొదలుపెట్టండి. ఒకే రోజు   ఒకటి కంటే  మించి  కొత్త ఆహారం  పెట్టకండి.  పిల్లలకి  అరటి పండు తో పాటు  ఆపిల్ గుజ్జు  కూడా పెట్టవచ్చు.

నిమ్మ జాతి పండ్లు కానీ , కరకర లాడేటువంటి  ఆహారం కానీ , పెరుగు కానీ  మరి ఏ ఇతర ఆహారం ఇవ్వకూడదు అని గుర్తు పెట్టుకోండి.ఎందుకంటే  అవి  పిల్లల  జీర్ణక్రియకు సరిపడవు అని మరువ కూడదు. పిల్లలు  తినడానికి ఇష్టం చూపక పోతే  మాత్రం  బలవంతం గా పెట్టకుండా.. నెమ్మది గా  అలవాటు  చేయడానికి ప్రయత్నం చేయండి.  బియ్యాన్ని దోరగా  వేగనిచ్చి , నూకలుగా చేసి  దాన్ని   మెత్తగా ఉడకపెట్టి ,పప్పు తేట కానీ చారు కానీ వేసి,నెయ్యి వేసి   కలిపి తినిపించాలి. ఇలా చేయకుండా డైరెక్ట్ గా  బియ్యంతో వండిన అన్నం  పెట్టేస్తే  పిల్లలకు అజీర్తి సమస్యలు  వస్తాయి.


Share

Related posts

గ్రీ టీ తాగకూడని వాళ్ళు వీళ్ళే !

Kumar

విటమిన్ సీ ఫుడ్ మీ వంటింట్లోనే ఉంది .. !

Kumar

Ginger Oil: అల్లం నూనె ఇలా వాడితే ఈ ప్రయోజనాలు..!!

bharani jella