Wheat Laddu: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. పోషకాహార లోపం వలన పెద్ద వారిలో నరాల బలహీనత.. చిన్న పిల్లల్లో మతిమరుపు వంటి సమస్యలు వస్తున్నాయి.. వీటన్నింటికీ పరిష్కారం గోధుమ లడ్డు..! గోధుమలతో మనం చపాతీ పూరీలు తయారు చేసుకుంటూ ఉంటాం.. అంతేకాకుండా గోధుమ రవ్వతో ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది.. ఇందులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. గోధుమలు మన శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఈ లడ్డూలు తయారు చేసుకొని తినడం వలన శరీరానికి కావలసిన పోషక ఆహారం లభిస్తుంది..! గోధుమ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!
గోధుమ లడ్డు కి కావాల్సిన పదార్థాలు..
గోధుమపిండి ఒక కప్పు, పంచదార అర కప్పు, నెయ్యి పావు కప్పు, బాదం రెండు చెంచాలు, జీడిపప్పు రెండు చెంచాలు, ఎండు ద్రాక్ష రెండు చెంచాలు, యలుకల పొడి కొద్దిగా..
ముందుగా పంచదారను పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయించి పక్కన ఉంచుకోవాలి.. ఇప్పుడు మిగిలిన నెయ్యి మొత్తం వేసి వీడే యాక అందులో గోధుమ పిండిని వేసి కాస్త దోరగా వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పంచదార పొడి, యాలుకల పొడి వేసి కలపాలి. చివర్లో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.. అంతే గోధుమ లడ్డు రెడీ..
ఈ గోధుమ లడ్డూలను రోజుకి ఒకటి చొప్పున పిల్లలు పెద్దలు తినవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మానసిక ప్రశాంతత అందిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…