గ్రీన్ టీ ఒక అద్భుతమైన డిటాక్సిఫైయర్. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, స్వచ్చమైన చర్మ ఛాయను అంధించడానికి, హానికరమైన రసాయనాలన్నింటిని తొలగిస్తుంది. ఇంకా ఇది ముఖంలో జిడ్డును తగ్గించడానికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా చర్మం మెరిసేలా చేస్తుంది. అందుకు సులభంగా గ్రీన్ టీను త్రాగడం కానీ లేదా గ్రీన్ టీని ప్యాక్ ల రూపంలో ముఖానికి నేరుగా అప్లై చేయడంద్వారా గానీ, గ్రీన్ టీ యొక్క అద్భత ప్రయోజనాలు పొందవచ్చు.
మరి మెరిసే చర్మం పొందడానికి గ్రీన్ టీ ఫేస్ ప్యాక్స్ ఏంటో, గ్రీన్ టీ ని ఫేస్ కి ఎలా అప్లై చేస్తే లాభాలో ఒక సారి చూద్దాం. గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ తో స్కిన్ క్యాన్సర్ రాదు. అల్ట్రా-వయలెట్ కిరణాల నుంచి స్కిన్‌ని కాపాడుతుంది. మొటిమలను కంట్రోల్ చేస్తుంది. యవ్వనంగా కనిపించేటట్లు చేస్తుంది.
ఇంకా గ్రీన్ టీ ని ఎలా ఉపయోగించాలి అంటే..
బాగా పండిన బొప్పాయి గుజ్జు 1-2 టేబుల్ స్పూన్లు తీసుకొని, దానికి గ్రీన్ టీ రసాన్ని(గ్రీన్ టీ కాచగా వచ్చిన రసాన్ని) కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి, తడి ముఖం మీద ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. అప్లై చేసిన 15నిముషాల తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది కమిలిన చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. డల్ స్కిన్ తొలగించి, అందమైన మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
ఒక స్పూన్ శనగపిండిలో పావు టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల గ్రీన్ టీ కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ మిశ్రమాన్ని కళ్ళు, నోటి చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటూ అలాగే వదిలేసి చల్లని నీటితో కడిగేయాలి. అలా వారానికి ఒకటి, రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది .