NewsOrbit
హెల్త్

Shaking Legs: కూర్చున్నప్పుడు తెలీకుండానే కాళ్ళు ఊపుతున్నారా.. చాలా ప్రమాదం ఇది !

Shaking Legs: చాలా మంది కూర్చున్నప్పుడు తమ రెండు కాళ్లు ఊపుతూ ఉంటారు. కొంత మంది కాళ్లను చిన్నగా ఊపితే, మరి కొంత మంది వేగంగా, పెద్దగా ఊపుతుంటారు. కొంత మంది అలవాటుగా కాళ్లు ఊపుతూ ఉంటారు. మరి కొందరు అప్రయత్నంగా కాళ్లు ఊపుతూ ఉంటారు. ఈ లక్షణం ఎక్కువగా యువతలో కనిపిస్తుంటుంది. స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు ఇలా ఏదో సందర్భంలో కూర్చున్నప్పుడు తమకు తెలియకుండానే కాళ్లు ఊపుతూ కనబడుతుంటారు.

habit of Shaking legs
habit of Shaking legs

అయితే ఇలా ఎందుకు చేస్తున్నారంటే కారణం పెద్దగా చెప్పలేకపోయినా టెన్షన్, ఒత్తిడి, కంగారు అని పరిశోదకులు చెబుతున్నారు. వ్యక్తుల్లో షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు ఈ అలవాటు మొదలవుతుందని అంటున్నారు. సరిపడా నిద్ర లేని సమయంలోనూ ఈ సమస్య వస్తుందని అంటున్నారు. శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ తప్పినప్పుడు కూడా ఈ సమస్య వస్తుందట. సరిగ్గా నిద్ర పట్టని వాళ్లు, ఆ తరువాత ఏదైనా పనిలో ఉన్నప్పుడు నిద్ర వస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా కాళ్లు ఊపుతుంటారు. ఇలా చేయడం వల్ల నిద్ర కంట్రోల్ అవుతుంద కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ సమస్య నుండి బయటపడాలంటే ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం ఆరు గంటలైనా నిద్ర పోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. ఇలా చేసినా ఆ అలవాటులో మార్పురాకపోతే ఐరన్ టాబ్లెట్ లు వాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ మందులు వాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. ఐరన్ టాబ్లెట్ లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనుకునే వారు వాటికి బదులుగా అరటి పండ్లు, పాలక్, బీట్ రూట్ వంటివి తీసుకుంటే మేలు అని పేర్కొంటున్నారు. కాళ్లు ఊపడం అలవాటు ఉండే వారు ఎక్కువగా కాఫీ, టీ త్రాగుతుంటారు. అయితే వీటిని తగ్గించుకోవడంతో పాటు రాత్రి సమయంలో మొబైల్ ని దూరంగా పెట్టడం, రాత్రి వేళ నిద్రపోయే సమయానికి టీవీ చూడకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే కాళ్లు ఊపే అలవాటు పోతుంది.

 

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri