NewsOrbit
హెల్త్

Hair Transplantation: మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ యొక్క ప్రమాదకరమైన దుష్ప్రభావాలు, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు తెలుసుకోండి!

Hair Transplant: Dangerous side effects of Hair Transplant and safer alternatives to Hair Transplant, Why Women should not go for Hair Transplant and instead choose these alternatives?

Hair Transplantation: జుట్టు అనేది స్త్రీ, పురుషల ముఖానికి అందాన్ని తెచ్చిపెడుతుంది. తలపై వెంట్రుకలు లేకపోతే ముఖంలో ఏదో వెలితి కనిపిస్తున్నట్లు ఉంటుంది. ముఖ్యంగా చాలా మందిలో బట్టతల సమస్యతో తలపై వెంట్రుకలు లేవన్న ఆత్మన్యూనతతో ఉంటారు. అలాంటి వారు తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. విగ్గులు పెట్టుకోవటం, టోపిలతో తలను కవర్ చేయటం వంటివి చేస్తారు. నలుగురిలో అవమానంగా ఫిలయ్యేవారికి ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చక్కని పరిష్కార మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలికాలంలో బట్టతల ఉన్నవారు చాలా మంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పొందుతున్నారు. అయితే ఈ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.!? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి !? మహిళలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవచ్చా.!? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం లేకుండా ఎలాంటి సహజ సిద్ధమైన పద్ధతులు ఉన్నాయో తెలుసుకుందాం..

Hair Transplantation: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సైడ్ ఎఫెక్ట్స్.?? మహిళలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోకూడదా.!?

Hair Transplantation /హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్: Dangerous side effects of Hair Transplant and safer alternatives to Hair Transplant, Why Women should not go for Hair Transplant and instead choose these alternatives?
Hair Transplantation హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ Dangerous side effects of Hair Transplant and safer alternatives to Hair Transplant Why Women should not go for Hair Transplant and instead choose these alternatives

సాధారణంగా బట్టతల సమస్య అనేది జన్యుపరంగా వస్తుంది. మరికొందరలి వంశపారం పర్యంగా, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మందులు వాడే వారిలో, హర్మోన్ల ప్రభావం, ఆహారంలో మార్పుల కారణంగా కూడా వెంట్రుకలు ఊడిపోయి బట్టతల ఏర్పడుతుంది. తల్లిదండ్రుల్లో ఎవరికి బట్టతల ఉన్నా సంతానానికి రావొచ్చు. బట్టతల రావటానికి 80-90 శాతం జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ విధానంలో నాటిన వెంట్రుకలు త్వరగా పెరుగుతాయి. సులువైన ఈ విధానంపై చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. అయితే దీని వల్ల ఎలాంటి దుష్పప్రభావాలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. కాకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న కొందరు..

Hair Transplantation Side Effects: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సైడ్ ఎఫెక్ట్స్..

1. జుట్టు రాలడం

సాధారణంగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన రెండు నుంచి మూడు వారాల పాటు జుట్టు రాలిపోతూ ఉంటుంది ఎందుకంటే స్కల్ఫ్ పై జరిగిన సర్జరీ కారణంగా ఎలా జరుగుతుంది. ఆ తరువాత మళ్లీ జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రధానంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు రాలడం అధికంగా ఉంటుంది.

2. రక్తస్రావం

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొందరిలో రక్తస్రావం కనిపిస్తుంది.

3. అంటువ్యాధులు

మీరు మంచి వైద్యుడిని ఎన్నుకుంటే.. మీకు ఎటువంటి అంటువ్యాధులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు.. కానీ ఉత్తమమైన సౌకర్యాలతో కూడా కొన్ని అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

4. నొప్పి
జుట్టు పునరుద్ధరణ విధానం, FUE, FUT అనేది శస్త్రచికిత్సా ప్రక్రియ లో నొప్పి ఉంటుంది, ముఖ్యంగా FUT లో చాలా సందర్భాలలో, డాక్టర్ మత్తుమందులు, అనస్థీషియాను ఇస్తారు. అరుదైన కేసులలో నొప్పి ఉంటుంది. పోస్ట్-ఆప్ వ్యవధిలో దానిని నివారించడానికి డాక్టర్ మీకు కొన్ని నొప్పి నివారణ మందులను సూచిస్తారు.

5. దురద

ఇది బహుశా సర్వసాధారణమైన దుష్ప్రభావం. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చాలా ఎక్కువ మంది ఈ సమస్యతో ఇబ్బంది పడతారు. తరచూ తలస్నానం చేస్తూ ఉంటే ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుల్ని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

6. వాపు

స్కాల్ప్ పై వాపు మరొక సెడ్ ఎఫెక్ట్. ఇది చాలా సాధారణం. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న వారిలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. ఈ ప్రక్రియకు గురైన మెజారిటీ ప్రజలలో కనిపిస్తుంది. నుదిటిపై వాపు కలిగి ఉండవచ్చు, మరికొందరికి అది వారి కళ్ళ చుట్టూ ఉండవచ్చు. అయితే ఈ వాపు కొద్ది రోజుల్లోనే తగ్గుతుంది. అయితే, కొద్ది రోజుల్లో కూడా తగ్గకపోతే వైద్యుడిని కలవడం మంచిది.

7. తిమ్మిరి

FUT విధానంలో తిమ్మిరి మొదలవుతుంది.

8. మచ్చలు

మీరు FUE కి గురైతే, మీకు చిన్న మైక్రో మచ్చలు వస్తాయి. అవి కొన్ని వారాల్లో మాయమవుతాయి. కొత్త జుట్టు పెరిగినప్పుడు అవి కనిపించవు.

9. తిత్తులు

చాలా సార్లు, ఈ తిత్తులు మొటిమల స్కాల్ఫ్ పై కనిపిస్తాయి. అరుదైన కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయి, సాధారణంగా ఈ తిత్తులు కొన్ని వారాల్లో పోతాయి ఒకవేళ ఈ సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

10. ఎక్కిళ్ళు

ఎక్కిళ్ళు అనేది సాధారణ సమస్య అయినప్పటికీ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న కొందరిలో అధికంగా వస్తూ ఉంటాయి తరచూ రావడం వల్ల ఈ సమస్య కాస్త తీవ్రంగా అనిపిస్తుంది అయితే ఈ సమస్య అందరిలోనూ రాకపోవచ్చు అది కొద్ది మందికి మాత్రమే వస్తుంది.

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఆ క్లినిక్ గురించి ముందుగా తగిన జాగ్రత్తలు తెలుసుకొని ఉండాలి. క్లినిక్ ను మీరు సెలెక్ట్ చేసుకునే దానిపై ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆధారపడి ఉంటుంది. సురక్షితమైన శాశ్వత హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకునేటప్పుడు ఆ క్లినిక్ అంతా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి.

Hair Transplantation in Women: మహిళలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోకూడదా.!?

మహిళల్లో ఈ సమస్య చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే వీరికి పైన జుట్టు మధ్యలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది అయితే నేటి యువత జడ వేసుకోవడం లేదు కాబట్టి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వరకు వెళ్లడం అనవసరం అని కొందరి నిపుణులు చెబుతున్నారు. అలాగే వీరికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వలన సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంట్లో వర్క్ టెన్షన్ తో పాటు మళ్ళీ ఇది అధికమవుతుంది .అందువలన వీళ్ళు హెయిర్ ట్రాన్స్పలాంటేషన్ చేయించుకోకపోవడం దానికి బదులు సహజసిద్ధమైన పద్ధతులను ఎంచుకొని జుట్టు పెరిగేలాగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

వీటితో జుట్టు మళ్ళీ పెరుగుతుంది..

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే కొత్త జుట్టు వస్తుంది. రసాయనాలు ఉన్న షాంపులకు బదులు శీకాకాయ, కుంకుడుకాయ వంటి షాంపులను ఉపయోగిస్తూ.. ఉసిరికాయ పొడిని జుట్టుకు అప్లై చేసుకోవడం వలన కూడా జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరిగే అవకాశం ఉంది. ఉసిరికాయ రసం కూడా కొత్త వెంట్రుకలు రావడానికి సహాయపడుతుంది. అశ్వగంధ, బ్రహ్మీ వంటి వనమూలికలతో తయారుచేసిన నూనెలు కూడా జుట్టు ఒత్తుగా పెరగడానికి కొత్త జుట్టు రావడానికి సహాయపడతాయి. సహజసిద్ధమైన వాటి ద్వారా జుట్టు పెరిగేలా చేసుకోవడం మంచిది. ఈ సర్జరీల వలన ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇటీవల హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తి మరణించిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ సంగతి తెలిసిందే. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకునేవారు ఆలోచించి జాగ్రత్తలు తీసుకొని ముందుకు అడుగు వేయడం మంచిది.

Dangerous side effects of Hair Transplant and safer alternatives to Hair Transplant, Why Women should not go for Hair Transplant and instead choose these alternatives?

Male Menopause Explained: పురుషులలో రుతువిరతి లక్షణాలు, కారణాలు, ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కోవటానికి చిట్కాలు.

 

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri