NewsOrbit
హెల్త్

Marriage Registration: మీ వివాహం రిజిస్ట్రేషన్ జరిగిందా ?? లేదంటే ఈ నష్టాలు తప్పవు !!

Marriage Registration: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం వివాహాల నమోదు తప్పనిసరి చేయాలని ఆదేశిస్తూ 2006 ఫిబ్రవరి 14వ తేదీన మార్గదర్శకాలను జారీ చేసింది. హిందూ వివాహ చట్ట ప్రకారం పెళ్లి చేసుకోబోయే వరుడి కి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు కచ్చితం గా నిండి ఉండాలి.

Marriage Registration: వివాహం నమోదు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం..

సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ల్లో  వివాహ నమోదు ఎప్పటినుంచో జరుగుతుంది. పురపాలక సంఘాల్లో  కూడా  వివాహ నమోదుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. గ్రామ పంచాయతీలలో కూడా నమోదు చేసుకోవచ్చు. వివాహానికి ముందుగానే వివాహ సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేస్తే నిర్ణీత రుసుం తీసుకుని దరఖాస్తు ఫారం ఇస్తారు. ముగ్గురి సాక్షి  సంతకాలతో పంచాయతీ కార్యదర్శి, పురపాలక ప్రత్యేక ఉద్యోగి  వివాహ ధ్రువీకరణ పత్రం అందచేస్తారు. పెళ్లై చాలా కాలం అయిన వారు కూడా నమోదు చేసుకునే  వీలుంది .
రిజిస్ట్రేషన్ కు కావల్సిన పత్రాలు ఇవే…
వధూ వరులు చదువుకున్న వారైతే 10వ తరగతి మార్కుల లిస్ట్, నివాస ధృవీకరణ పత్రం, ఓటరు కార్డు,రేషన్ కార్డు, ఆధార్ కార్డు లో ఏదో ఒకటి ఉండాలి. వాటితో పాటు తాళి కట్టిన, జీలకర్ర బెల్లం పెట్టిన ఫోటోలు కూడా జత చేయాలి  . గుళ్లో పెళ్లి చేసుకుంటే ఆలయ అధికారులు కానీ, బాధ్యులు కానీ ధృవీకరణ పత్రం ఇవ్వవలసి ఉంటుంది. వేర్వేరు కులాలు, మతాల వారు వివాహం చేసుకుంటే ముందుగానే సబ్ రిజిస్ట్రార్ కు సమాచారం తెలియ చేయవలసి  ఉంటుంది. దీంతోపాటు ఫోటోలు, ముగ్గురు సాక్షుల సంతకాలు ఉండాలి.
ఇలా చేయడం వలన జరిగేది ఇదే
వివాహం నమోదు చేసుకున్న స్త్రీలకు  ఏమైనా సమస్యలు వస్తే సులభంగా పరిష్కరించుకోవచ్చు. విడాకులు తీసుకోవాలి అన్న, భరణం పొందాలన్న , పిల్లల సంరక్షణ కోసం, ఆస్తి వివాదాలు,ఇలా వీటిలో  అయినా  వివాహ ధృవీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు.
రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు రిజిస్ట్రేషన్  బాగా పనిచేస్తుంది.

ప్రేమ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
శారీరక, మానసిక వేధింపులకు,వరకట్న వేధింపులు, గురిచేసే భర్తలు, వారి కుటుంబ సభ్యుల పైన ఫిర్యాదులకు ఉపయోగపడుతుంది.
పాస్ పోర్ట్ పొందేందుకు కూడా  ఇది ఉపయోగపడుతుంది.
వివాహ ధృవీకరణ పత్రం మన దేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది.కాబట్టి ప్రతి ఒక్కరు వివాహం రిజిస్టర్ చేసుకోవడానికి నిర్లక్ష్యం చేయకూడదు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri