Ulavala: నవధాన్యాలలో ఉలవలు కూడా ఒకటి.. వీటిని గుగ్గిళ్ళుగా, చారు గా చేసుకుని తినేవారు.. ఉలవలలో ఉన్నన్ని పోషకాలు మరే ధాన్యం లో ఉండవంటే అతిశయోక్తి కాదు.. ఇందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.. ఎదిగే వయసు పిల్లలకు పోషకాహారం మరొకటి లేదు..! పిల్లలికి బలం ఉలవలు.. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిస్తాయి శరీరానికి కావలసిన పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి.. ఇన్ని లాభాలు కలిగిన ఉలవల కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!
ఉలవల కర్రీ తయారీ కి కావాల్సిన పదార్థాలు..!
ఉలవలు ఒక కప్పు, టమాటాలు రెండు, పెరుగు అర కప్పు, సన్నగా తరిగిన కొబ్బరి తురుము అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, పచ్చిమిర్చి రెండు, వెల్లుల్లి ఐదు , నిమ్మకాయ ఒకటి, మీగడ రెండు చెంచాలు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా , తాలింపు గింజలు ఒక చెంచా.
ముందుగా ఉలవలు కడిగి ఒక గిన్నెలో రెండు గంటల పాటు నాన పెట్టుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటో అన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నాన పెట్టుకున్న ఉలవలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు , జీలకర్ర , మీగడ అన్నీ వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఆ తరువాత పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తురుము వెల్లుల్లి రెబ్బలు పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బాండీలో రెండు చెంచాల నూనె వేసుకుని తాలింపు గింజలు వేసి కరివేపాకు, కొత్తిమీర వేయలి. అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉలవలు మిశ్రమం వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన ఉలవల కర్రీ రెడీ. ఈ కూరను పిల్లలకు తినిపిస్తే వారి శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఎదిగే పిల్లలు వీటిని తింటే చాలా మంచిది.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…