ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే వీటిని ఆకాకర కాయలు లేదా బోడ కాకర అని పిలుస్తారు. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. అందుకే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
అయితే, ఇదిఅందించే ఆరోగ్యం ముందు.. ధర పెద్ద లెక్క కాదు అనే చెప్పాలి. ఆ కాకర కాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. మరి ఆకాకరతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం…
ఆకాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఆకాకరలోని ఉండే ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. సాధారణ కాకర కాయ తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రించడం లో బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆకాకర రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వివిధ అలెర్జీలు దరి చేరవు.
ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి కి సంబందించిన వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తాయి. క్యాన్సర్ల బారిన పడకుండా అడ్డుకోవడం లో ఆకాకర బాగా పనిచేస్తుంది. ఆకాకరలోఉండే విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
ఆకాకరలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.ఆకాకర కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఆకాకరను వండేప్పుడు.. చాల మంది వాటిపై ఉండే బొడిపెలను తీసేస్తూ ఉంటారు. కానీ ఆలా తియ్యకూడదు తీయకూడదు. ఎందుకంటే అసలైన పోషకాలు అన్ని అందులోనే ఉంటాయి.