NewsOrbit
హెల్త్

అమృతవల్లి ఉపయోగాలను తెలుకోండి.. పలు రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి

అమృతవల్లి ఆకుల గురించి చాలా మందికి తెలిసిఉండదు. అమృతవల్లి అంటే ఏదో కాదు తిప్పతీగనే. దీన్ని ఆయర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేదం వైద్యంతో పాటు అలోపతి వైద్యానికి సంబందించిన మందుల తయారీకి కూడా ఈ తిప్ప తీగను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆకులను ఆయుర్వేదంలో పూర్వం నుండే ఉపయోగిస్తున్నారు. ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) వారు కూడా ఈ ఆకులలో చాల ఔషధ గుణాలు ఉన్నాయని ధ్రువీకరించింది. రోజు ఈ ఆకుల రసం తీసుకోవడం వల్ల చాల ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ముఖ్యంగా మధుమేహ వ్యాదిగ్రస్తులు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆకు రసం తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఉపయోగాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

అమృతవల్లి అని పిలిచే ఈ తిప్ప తీగ నిజంగానే అమృతవల్లి అనొచ్చు. అమృతం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ రసం తాగడం వల్ల కూడా అంతే ఉపయోగాలు కలుగుతాయి. రోజు ఉదయాన్నే తాజాగా ఉన్న ఆకులను తోసుకొని రసంలాగా మరిగించి తీసుకోవచ్చు. లేదా ఈ ఆకులను ఎండపెట్టి చూర్ణం చేసి ఆ పొడిని నీటిలో మరిగించి కూడా టీ లాగ తాగవచ్చు. ఈ రసాన్ని రోజు తాగడం వల్ల పలు రోగాల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఈ తీగలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రక్తంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాతో పోరాడి రక్త సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉపయోగపడుతుంది. అంతేకాదు కాలేయానికి సంబందించిన వ్యాధులు కూడా రాకుండా అడ్డుకుంటుంది. నిత్యం ఉదయం తీసుకోవడం వల్ల సీజనల్ విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్ప రసానికి ఉంది.

కాచి చల్లార్చిన ఈ తిప్ప ఆకు రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరచమే కాకుండా అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది. తిప్పతీగలో ముఖ్యంగా మధుమేహాన్ని నివారించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగం వల్ల నిత్యం కలిగే ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బందిపడుతుంటే తిప్పతీగ రసంతో తొలగించుకోవచ్చు. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తి పెరుగుదలకు కృషి చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జబలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు పలు రకాల కీళ్ల సమస్యలను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. రోజు ఒక్క ఆకు తింటే చాలు కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా చేయగల సామర్థ్యం ఈ ఆకులో ఉన్నాయి. గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు తప్ప అందరు ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri