Avisa Plant: మన పెరట్లోనే మన ఆరోగ్యం ఉంటుందని మన పూర్వీకులు చెప్పేవారు.. ఎందుకంటే మన పెరటిలో ఔషధాలు తో నిండిన చెట్లను వారు పెంచేవారు.. మన పెరట్లో కచ్చితంగా ఉండాల్సిన చెట్లలో అవిసె కూడా ఒకటి.. దీనిని ఆగస్త్య చెట్టు అని కూడా పిలుస్తారు.. అవిశ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..,!!
అవిసె ఆకులను దంచి రసం తీసుకోవాలి.. ఆ రసాన్ని తాగుతూ ఉంటే అంటే మూత్రం సాఫీగా అవుతుంది. లేదంటే ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగినా మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. శరీరం వేడెక్కేలా చేస్తుంది. ఫలితంగా దగ్గు, జలుబును తగ్గిస్తుంది. ఈ ఆకుల రసాన్ని కఫ రోగాలను నయం చేస్తుంది. ఈ ఆకులు గవదబిళ్లలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమస్య ఉన్నవారు అవిస ఆకులలో సున్నం వేసి మెత్తగా నూరుకొవాలి. ఈ మిశ్రమాన్ని పట్టి లాగా వేసుకుంటే గవదబిళ్లలు తగ్గిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ ఆకులను పప్పు, కూరగా వండుకొని తినవచ్చు. ఇలా ఈ ఆకులను తింటే విరోచనాల సమస్య నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంకా శరీరంలో లో ఉన్న అధిక కొవ్వు కూడా కరిగిస్తుంది. అవిసే ఆకుల రసం ఒక చుక్క కంట్లో వేస్తే కంటి మసకలు తగ్గిపోతాయి. ప్రతి రోజు ఇలా చేస్తుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రేచీకటి ఈ సమస్య తో బాధపడుతున్న వారు ప్రతిరోజు 10 ml ఈ ఆకుల రసం తాగితే ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.