Copper: సాధారణంగా వెండి, బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వజ్రాల కంటే ఎక్కువగా బంగారు ఆభరణాలను ధరించడం సహజం. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతూ ఉంటారు. వెండి, బంగారం ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనందరికీ తెలిసిందే…కానీ రాగి వస్తువులను ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అన్న విషయం ఎవరికీ తెలియదు. పూర్వం రోజుల్లో ఎక్కువగా రాగి వస్తువులను వాడేవారు.

ప్రస్తుత కాలంలో కూడా చాలా అరుదుగా వాడుతున్నారు. మరి ముఖ్యంగా కొత్తగా రాగి బాటిల్స్ మరియు రాగి ప్యూరిఫైయర్స్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇక రాగి ఉంగరాలను మరియు కడియాలను కూడా చాలామంది ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు కానీ ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు చాలావరకు తగ్గుతాయి.
రాగిణి ఉపయోగించడం వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. అలాగే కొన్ని రాగి ఉంగరాలు మరియు కడియాలు ధరిస్తే వేడి తగ్గుటకు ఎంతగానో సహాయపడతాయి. మన దేశం ఉష్ణ దేశం కాబట్టి ఒంట్లో ఉన్న వేడి తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే హృదయ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. రాగి ధరించడం వల్ల మర్యాద కూడా ఎక్కువగానే పెరుగుతుంది. అంతేకాకుండా రాగిణి ధరించడం వల్ల సమాజంలో గౌరవం కూడా ఎక్కువగా పొందుతారు. కావున మనం వీలైనంతవరకు రాగి ని ఉపయోగించడం. వలన ఎన్నో ఫలితాలను పొందుతామని భావించవచ్చు.