మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం శ్వాస మనం జీవించి ఉండడానికి ఇది కీలకపాత్ర పోషిస్తుంది కానీ ఇప్పుడు చాలామంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు సమస్యల నుంచి బయటపడాలంటే ఘాడంగా ఊపిరి పీల్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
గాఢంగా ఊపిరి తీసుకోవడం వలన మనకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ప్రతిరోజు ఇలాంటి వ్యాయామం చేయడం వల్ల హృదయ స్పందన రేటును తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంకా నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. టెన్షన్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నప్పుడు పొట్టపై ఒక చేయి వేసి ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకోవాలి.. ఇలా ఒక నిమిషం పాటు చేసి మరలా ఇదే విధంగా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. ఒత్తిడి టెన్షన్ నుంచి తక్షణమే తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది..
శ్వాస వ్యాయామలను క్రమం తప్పకుండా చేయటం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎముకలు దృఢంగా మారతాయి. దీర్ఘమైన శ్వాస వ్యాయామం చేస్తే శరీరాన్ని ప్రశాంతత పరుస్తుంది. గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది. మనసును శాంత పరుస్తుంది. శ్వాసక్రియ రక్తంలో ఆక్సిజన్ ను ప్రభావితం చేసి వాటి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి..