NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Health: మీకు లేదా మీ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే వెంటనే ఈ ఆకులు తెచ్చిపెట్టుకోండి..

Health benefits of giloy

Health: ప్రస్తుతం అనేక మంది డయాబిటిస్ (షుగర్) వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ కంట్రోల్ కోసం వారు నానా తంటాలు పడుతుంటారు. ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం, వాకింగ్ లాంటివి చేస్తుంటారు. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎన్నో ఔషద గుణాలు ఉన్న తిప్పతీగ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు అయుర్వేద వైద్య నిపుణులు. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి తిప్పతీగను ఉపయోగిస్తుంటారు.

Health benefits of giloy
Health benefits of giloy

కొంత మంది నిపుణులు తిప్పతీగ ఉపయోగించడం వల్ల లివర్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. తిప్పతీగ ఉపయోగించిన ఆరుగురు పేషంట్స్ లో లివర్ సమస్యలు గుర్తించామని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే తిప్పతీగ వల్ల ఎటువంటి సమస్యలు రావని ఇటువంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని మరి కొందరు చెబుతున్నారు. పురాతన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. తిప్పతీగపై అనేక పరిశోధనలు చేసిన తరువాత ఎటువంటి సమస్యలు రావని వెల్లడైందని చెబుతున్నారు.

ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగను ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని వల్ల ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. తిప్పతీగలో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. స్టెరాయిడ్స్ మరియు కార్బోహైడ్రైట్స్ ఎక్కువగా ఉంటాయి. తిప్పతీగ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో కూడా ఫైట్ చేయగలవు. శరీరంలోని కణాలు దెబ్బకుండా ఉండటానికి ఎంతో బాగా తిప్పతీగ సహాయం చేస్తుంది. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది.

అలాగే తిప్పతీగ వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అటువంటి వాళ్లు తిప్పతీగ తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఆందోళన కూడా తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కూడా తిప్పతీగ బాగా ఉపయోగపడుతుందట. అంతే కాకుండా తిప్పతీగ జీర్ణ వ్యవస్థ ను మెరుగుపర్చడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మధుమేహానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ని త్వరగా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. రక్తాన్ని ఫ్యూరిఫై చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందట. లివర్ సమస్యలను కూడా తొలగిస్తుంది.

గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు అందిస్తున్నాం. ఈ కథనం కేవలం అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడమే మేలు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N