Health: సాధారణంగా చిన్న పిల్లలు బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చెబుతుంటారు. అందుకే చిన్న పిల్లలకు బెండకాయ వండి పెడుతుంటారు. ఇది శాస్త్రీయంగా నిరూపితం అయితే కాదు కానీ బెంగకాయ వల్ల శరీరానికి ఏంతో మేలు అని మాత్రం చెబుతున్నారు. బెండకాయ వల్ల ప్రయోజనాలు ఏమిటంటే..
బెండకాయలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బెండకాయలో విటమిన్ సీ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని శరీరానికి అందించడానికి సాయపడుతుంది. అదే విధంగా దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. దాని వల్ల హృదయ సంబంధ ఇబ్బందులకు తావు ఉండదు. అంతే కాదు చెడు కొవ్వును శరీరం నుండి బయటకు పంపించేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ, బీటా కెరాటిన్ కంటి చూపు మెరుగుపడుతుంది.
మరో విశేషం ఏమిటంటే బెండకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కారణంగా కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల తక్కువ తింటారు. దీని మూలంగా బరువు తగ్గుతారు. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడంతో బెండకాయ బాగా పని చేస్తుంది. బెండకాయను ఆహారంలో క్రమంగా చేర్చుకున్న వారు మలబద్దకం తదితర సమస్యలతో బాధపడకుండా ఉంటారు. ప్రేగులను శుభ్రపర్చడంలో కూడా సాయపడుతుంది. బెండకాయలో ఉండే ఎజినాల్ అనే ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ తో బాధపడేవారు బెండకాయలను అహారంగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తగ్గి రక్తహీనత రాకుండా బెండకాయ కాపాడుతుంది. ఫోలేట్, విటమిన్ కే రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.