Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ పియర్స్ పండు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు.. జామకాయలలా పియర్స్ సంవత్సరం అంతా దొరకవు.. ఈ సీజన్లోనే ఇవి వస్తాయి.. ఈ పండ్లు వచ్చినప్పుడు వీటి రుచి చూడాల్సిందే.. పియర్స్ ఎందుకు తప్పనిసరిగా తినాలో ఇప్పుడు చూద్దాం..!

పియర్స్ పండ్లలో విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.. వీటి రుచి క్రంచీగా ఉంటుంది.. మందుల తయారీలోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.. ఇందులో క్యాలరీస్ ఎక్కువగానూ కార్బోహైడ్రేట్స్ తక్కువగాను ఉంటుంది.. ఇక ఫ్యాట్ అసలు ఉండదు.. ప్రోటీన్, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. పియర్స్ పండ్లు ఎంత తిన్నా బరువు పెరగరు.. డయాబెటిస్ పేషెంట్లు దీన్ని చక్కగా తినవచ్చు.. హార్ట్ పేషెంట్లు కూడా వీటిని హాయిగా లాగించేసేయొచ్చు..

పియర్స్ పండ్లు చర్మం, జుట్టు, గోర్లకు మేలు చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం మన ఎముకలను, దంతాలను దృఢంగా చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు, వేడి చేసినప్పుడు, గొంతు గరగరగా ఉన్నప్పుడు పియర్స్ పండు తింటే త్వరగా శరీరాన్ని చల్లబరుస్తుంది. బాడీలో వేడిని తగ్గిస్తుంది. ఈ పండు తినడం వలన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇంకా మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది . రక్త వృద్ధి జరిగేలా చేస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గాయాలను తగ్గిస్తుంది. కణాలను సరిచేస్తుంది.