NewsOrbit
హెల్త్

Ragi Malt: ఈ “జావ” ఆరోగ్యానికి ఎంత మేలో తెలిస్తే వదిలిపెట్టరు..

Ragi Malt: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. లాక్ డౌన్, కర్ప్యూ కారణంగా శారీరక శ్రమ లేకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకునేందుకు ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని తెలిసిన వారిని, వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. రోగ నిరోధ శక్తిని పెంపొందించుకుంటే కరోనా లాంటి వైరస్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. కరోనా తొలి దశలో చాలా మందికి కరోనా సోకిన విషయమే తెలియకుండానే వారికి టచ్ చేసి వెళ్లిపోయింది. ప్రధానంగా వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే తగ్గిపోయింది. ఈ విషయాలు పలు అధ్యయనాల్లోనూ బయటపడింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ బలవర్థకమైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు.

 Health Benefits of Ragi Malt
Health Benefits of Ragi Malt

ఈ సమయంలో శరీరానికి శక్తిని ఇచ్చేవాటిలో రాగులు ఒకటి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రాగి జావ, రాగి సంకటిగా, రొట్టెలుగా తీసుకునే వారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ ఎండా కాలం రాగి జావను తీసుకుంటున్నారు. రాగుల్లో అధికంగా కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు ఏ, బీ, సీ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల ధృడత్వంగా ఉంచడంలో కాల్షియం సహాయపడుతుంది. విటమిన్ ఏ కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రాగి జావ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. బియ్యం కంటే రాగుల్లో కార్పోహైడ్రేడ్లు తక్కువ. పీచు అధికమే. అందుకే రాగులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఏ మాత్రం పెరగవు. రాగులను అంబలిగా, రొట్టెలుగా, సంగటిగా తీసుకుంటే షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేకూరుతుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమంగా ఉంచుతుంది. వేసవి కాలంలో చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసట చెందుతారు. అటువంటి సందర్భాలలో తక్షణ శక్తి కోసం రాగి జావ ఎంతగానో ఉపయోగపడుతుంది.

 Health Benefits of Ragi Malt
Health Benefits of Ragi Malt

టేస్టీగా రాగి డ్రింక్ ఇలా చేసుకోవచ్చు

రాగి పిండి రెండు టీ స్పూన్లు, నీళ్లు ఒక కప్పు, పాలు – రెండు కప్పులు, పంచదార రెండు టేబుల్ స్పూన్లు, బాదం పొడి రెండు టీ స్పూన్లు, యాలకుల పొడి. శొంఠి పొడి అర టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు. నెయ్యి లేదా వెన్న ఒక టీ స్పూన్ తో టెస్టీగా డ్రింక్ తయారు చేసుకోవచ్చు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri