కాకరకాయ పేరు వింటే చాలు చాలామందికి ఆకలి. చచ్చిపోతుంది. ఎందుకంటే కాకరకాయ కూర తినడానికి చాలా. చేదుగా ఉంటుంది కాబట్టి చాలా మంది కాకరకాయ కూర తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయ తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి కాకరకాయను ఫ్రై చేసినా, ఉడికించినా,జ్యూస్ రూపంలో తీసుకున్నా గాని ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా వర్షాకాలంలో కాకరకాయను తినడం వలన రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది.
ఇవే కాకుండా కాకరకాయ గింజలు. తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ గింజల వలన కలిగే ఉపయోగాలు:
షుగర్ వ్యాధిగ్రస్థులకు :
కాకరకాయ గింజలు తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటుంది.
బరువు తగ్గడంలో :
కాకరకాయ గింజలు తినడం వలన బరువు సులభంగా తగ్గుతారు.కాకరకాయ గింజలను తినడం ద్వారా చాలా రకాల వ్యాధులు దూరం అవుతాయి.బరువు తగ్గాలనుకునే వారు కాకరకాయ గింజలను క్రమం తప్పకుండా తింటూ ఉంటే మంచిది.
నులుపురుగుల నివారణలో :
కొంత మందికి కడుపులో చిన్న తెల్లటి పురుగులు ఉంటాయి. అలాంటి నులుపురుగులు ఉన్నవారు 2 లేదా 3 గ్రాముల కాకరకాయ గింజలు తినాలి.లేదంటే కాకరకాయ జ్యూస్ తాగినాగాని ఫలితం ఉంటుంది. అది కడుపులో పురుగుల్ని చంపుతుంది.అలాగే గుండె సంబంధిత అనారోగ్యాలను కూడా రాకుండా చేస్తుంది. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.