మనం ప్రతిరోజూ తినే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రస్తుత కాలంలో. చాలామంది బ్రౌన్ రైస్ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బ్రౌన్ రైస్ తినడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఈ కాలంలో ప్రతి ఒక్క పదార్ధం కూడా కల్తీ అయిపోతుంది అనే చెప్పాలి. రుచి బాగుంది అనే చూసుకుంటున్నాం తప్పా తినేది ఆరోగ్యానికి మంచిదా.. కదా అనే విషయాన్ని ఎవరు ఆలోచించడం లేదు.ఫలితంగా అధిక రక్తపోటు, అధిక బరువు సమస్యలతో సతమత మవుతున్నారు. అందుకే వాటన్నిటికీ చెక్ పెట్టడానికి వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తింటే మంచిది అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.బ్రౌన్ రైస్ అంటే ధాన్యం.
బ్రౌన్ రైస్ యొక్క ప్రయోజనాలు:
ధాన్యం మీద ఉన్న తొక్కని తొలగించిన తరువాత వచ్చేవె బియ్యం. అయితే పూర్తిగా పోలిష్ పట్టకుండా కాస్త బ్రౌన్ కలర్‌లో ఉండటం వల్ల ఈ బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. అంటే ధాన్యంను పూర్తిగా ప్రోసెస్ చేయనప్పుడు బ్రౌన్ రంగులో ఉంటుంది. పూర్తిగా శుభ్రం చేస్తే తెలుపు రంగులో ఉంటాయి. ప్రోసెస్ చేయని బియ్యం కాబట్టే బ్రౌన్ రైస్ లో న్యూట్రియంట్లు అధిక మోతాదులో ఉంటాయి.మరి ఈ బ్రౌన్ రైస్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా.
గుండె ఆరోగ్యానికి :
బ్రౌన్ రైస్‌లో పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో లభించే ఫైబర్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇందులో లిగ్నాన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును తగ్గిస్తాయి.
బరువు తగ్గించడంలో :
బ్రౌన్ రైస్ తినడం వల్ల మీ శరీర బరువు కూడా చాలా సులభంగా తగ్గుతారు. వైట్ రైస్ లేదా ప్రోసెస్డ్ బియ్యంతో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ లో న్యూట్రియంట్లు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు సులభంగా తగ్గుతారు.
డయాబెటిస్ నియంత్రణ :
పాలిష్ చేసిన బియ్యంలో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంటనే పెరుగుతాయి. కానీ బ్రౌన్ రైస్ లో మాత్రం గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన షుగర్ స్థాయిలు వెంటనే పెరగవు. అందువల్ల బ్రౌన్ రైస్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది.అలాగే డయాబెటిస్ లేని వారు కూడా బ్రౌన్ రైస్‌ను నిత్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…