Categories: హెల్త్

క్యారెట్ జ్యూస్ రోజు తాగితే కలిగే ఉపయోగాలు..!

Share

ఈ కాలంలో క్యారెట్స్ బాగా దొరుకుతాయి.అలాగే దుంపల్లో ఒకటి అయిన క్యారెట్ ను పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే క్యారెట్ తినడానికి ఎంతో తియ్య‌గా ఉంటుంది. క‌నుక దీన్ని ప‌చ్చిగా కూడా తింటుంటారు. అయితే క్యారెట్ వ‌ల్ల మనకు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డంతోపాటు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది.ఈ సీజ‌న్‌లో వచ్చే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్యలు రాకుండా ఉండాలంటే క్యారెట్ జ్యూస్ తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. క్యారెట్ జ్యూస్‌ను రెండు రోజులకు ఒకసారి అయినా తాగుతూ ఉంటే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము. మరి ఈ క్యారట్ జ్యూస్ ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

క్యారెట్ ముక్క‌లు – రెండు క‌ప్పులు
పంచ‌దార – అర‌ క‌ప్పు
నీళ్లు – 4 క‌ప్పులు
నిమ్మ ర‌సం – 3 టీ స్పూన్స్
అల్లం ముక్క – ఒక ఇంచు ముక్క‌

ముందుగా క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఒక జార్ లో గాని లేదంటే బ్లెండ‌ర్ లో గాని వేయాలి. అలాగే క్యారెట్ ముక్క‌ల‌తో పాటుగా పంచ‌దార‌ను వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత 2 క‌ప్పుల నీళ్లును పోసి 3 నిమిషాల పాటు మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని వ‌స్త్రం స‌హాయంతో వ‌డ‌క‌ట్టుకుని అందులో నిమ్మ ర‌సాన్ని వేసి క‌లుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యారెట్ జ్యూస్ రెడీ అయినట్లే.

క్యారెట్ జ్యూస్ తాగడం వలన ప్రయోజనాలు :

క్యారెట్ జ్యూస్ నిత్యం తాగడం వలన శరీరంలోని మృత కణాలు చనిపోతాయి.చర్మం మంచి రంగులోకి మారుతుంది.చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

23 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

48 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago