సపోటా పండు అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఈ పండు చూడటానికి చిన్నగా ఉన్నా ఇందులో ఔషదాలు మిన్నగా ఉంటాయి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.తియ్యగా ఉండే ఈ సపోటా పండును ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.సపోటా పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.ఇవే కాకుండా సపోటా పండు వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
సపోటా పండు ఉపయోగాలు :
జ్వరం వచ్చినప్పుడు సపోట బెరడు ఉడకబెట్టి కషాయం చేసి తాగితే జ్వరం తగ్గుతుంది. అధిక జ్వరాన్ని తగ్గించడంలో సపోటా డికాషన్ బాగా సహాయపడుతుంది.అలాగే ఎక్కడన్నా నొప్పిగాని, వాపుగాని అనిపిస్తే అక్కడ సపోట గుజ్జును రాస్తే నొప్పి తగ్గడంతో పాటుగా వాపు కూడా తగ్గుతుంది.
అంతేకాకుండా సపోటలో జీర్ణక్రియకు ఉపయోగపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఫలితంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
పోషకాల గని సపోటా పండు :
సపోట తినడం వలన జీవక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది కావున బరువు కూడా తగ్గుతారు. అధిక క్యాలరీలు ఉన్న పండ్లకు బదులుగా సపోట ఫ్రూట్ రోజూ తినడం మంచిది. దీంతో బరువు సులభంగా తగ్గుతారు.అలాగే సపోటా పండులో విటమిన్ ఎ’ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి కంటికి సంబందించిన సమస్యలు ఎమన్నా ఉంటే తగ్గుతాయి. సపోటాలో ఉండే కాల్షియం, ఐరన్ ఎముకలను బలాన్ని చేకూరుస్తాయి. సపోటా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తొలగిస్తుంది. రోజూ సపోటా తినడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ తొలగిపోయి కాలేయం దృఢంగా మారుతుంది.