హెల్త్

వేడి నీళ్లు పొద్దునే తాగడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

Share

ఆహారం లేకుండా మనిషి కొన్ని రోజుల పాటు జీవించగలుగుతాడు కానీ నీరు లేకుండా మాత్రం ఒక్కరోజు కూడా జీవించలేడు.మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో నీరు కూడా అంతే అవ‌స‌రం.సరిగ్గా నీరు తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, వేడి చేయ‌డం, త‌ల‌నొప్పి వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వస్తాయి.నిజానికి చల్లటి నీటిని తాగడం కంటే గోరువెచ్చని నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇలా సాధార‌ణ నీటిని తాగ‌డం కంటే వేడి నీటిని, గోరు వెచ్చ‌ని నీటిని తాగితే మ‌నకు అధిక ప్ర‌యోజ‌నాల‌ను కలుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు.మరి వేడినీటిని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..

గోరువెచ్చని నీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

ప్ర‌తిరోజూ వేడి నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం శుభ్ర‌ప‌డి జీర్ణ‌క్రియ ప్రక్రియ మెరుగుప‌డుతుంది. గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల త‌గ్గుతాయి. గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే మ‌లినాలు కూడా తొల‌గిపోతాయి. గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. ఉదయాన్నే లేచిన వెంటనే గోరు వెచ్చని నీటిని తాగడం వలన శరీరంలో ఉన్న చెడు కోలేస్ట్రాల్ తగ్గిపోతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఉద‌యం పూట వేడి నీటిని లేదా గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.

అందాన్ని పెంచడంలో :

గోరు వెచ్చని నీటిని తాగడం వలన జ‌లుబు,ద‌గ్గు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి. అలాగే వృద్ధాప్యంలో చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు తొల‌గిపోతాయి. అదే విధంగా వేడి నీటిని లేదా గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వల్ల జుట్టు కాంతివంతంగా ఉండడంతో పాటుగా జుట్టు రాల‌డం కూడా త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ప్ర‌తిరోజూ గోరు వెచ్చ‌ని నీటిని లేదా వేడి నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

 

 


Share

Related posts

Child Care: పిల్లలకు నేర్పవలిసిన కనీస మర్యాదలు నేర్పుతున్నారా ?

siddhu

మీ పిల్లలు ఆన్లైన్ లో క్లాస్ లు వింటున్నారా?? అయితే ఇది మీకోసమే..

Kumar

Teenage: టీనేజ్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..!?

bharani jella