హెల్త్

అరటిపండు తింటే శరీరానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా..?

Share

అర‌టి పండు గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఆపిల్ పండులో ఎన్నో పోషక విలువలు ఉంటాయో అంతకు రెట్టింపు సంఖ్యలో అరటిపండులో పోషక విలువలు ఉంటాయి. అరటి పండు కూడా చాలా చౌకగా మనకు లభిస్తుంది. ప్రతి రోజు ఒక అరటిపండు తింటే ఎటువంటి అనారోగ్యలు అయినా సరే ఇట్టే మాయం అయిపోతాయి.అర‌టి పండులో కూడా చాలా ర‌కాలు ఉన్నాయి. ఎటువంటి ర‌కం అర‌టి పండును తిన్నా కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతగానో మేలు క‌లుగుతుంది. అర‌టి పండును తిన‌డం వ‌ల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!

అరటిపండు తింటే కలిగే ఉపయోగాలు :

అరటి పండు తినడం వలన మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.మ‌నం తిన్న‌ ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మయ్యేలా చేసే శక్తి అరటిపండులో ఉంది. ఒకవేళ ఎవరికన్నా విరేచ‌నం అవ్వకపోతే ఒక అరటిపండు తింటే చాలు వీరేచనం అవుతుంది. అలాగే ఎవరన్నా ర‌క్త‌హీన‌త స‌మ‌స్యతో బాధపడుతుంటే వారు తప్పకుండా అర‌టి పండును తినాల‌ని వైద్యులు చెబుతున్నారు.అర‌టి పండును తిన‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

రోజుకు ఎన్ని అరటిపండ్లు తింటే మంచిదో తెలుసా..?

నీర‌సంగా ఉన్న‌ప్పుడు ఒక్క అర‌టి పండును తిన‌డం వ‌ల్ల త‌క్ష‌ణ శ‌క్తి వస్తుంది.అలాగే స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో అరటి బాగా ఉపయోగపడుతుంది.ప్ర‌తిరోజూ మూడు అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అరటి పండు తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే పొటాషియం శాతం పెరుగుతుంది. అంతేకాకుండా మెద‌డు మ‌రియు ర‌క్త సంబంధిత రోగాలు వచ్చే అవ‌కాశం కూడా తగ్గుతుంది.అలాగే ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు ప్రతిరోజు 2 నుంచి 3 అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు.అలాగే అధిక బ‌రువు, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం క‌నీసం 1 పండును తిన‌వ‌చ్చు. అయితే వారు మ‌ధ్యాహ్నం భోజనం చేసిన ఒక గంట తరువాత తింటే మంచిది.


Share

Related posts

డయాబెటిస్ ఉన్నవారు యాపిల్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Teja

శరీరం ఫిట్ గా ఉన్న గుండెపోటు వస్తుందా.. కారణం అదే..!

Teja

 రోజుకి ఒకే ఒక్క గ్లాస్ ఈ జూస్ తాగండి …

Kumar