హెల్త్

కొబ్బరి పువ్వును అంత ఈజీగా మాత్రం తీసుకోకండి..ఎందుకంటే..??

Share

మ‌న‌లో చాలా మందికి కొబ్బ‌రి బొండాం, కొబ్బ‌రికాయ‌, కొబ్బ‌రి నీళ్ల గురించి తెలుసు కానీ చాలా మందికి కొబ్బ‌రి పువ్వు గురించి తెలియ‌దు.ఈ కొబ్బరి పువ్వు వలన కూడా మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.కొబ్బ‌రి పువ్వులో అనేక రకాల పోష‌కాలు ఉంటాయి కావున దీనిని తిన్న వెంటనే మనకు త‌క్ష‌ణ శ‌క్తి అనేది వస్తుంది. షుగ‌ర్ పేషెంట్స్ కూడా కొబ్బరి పువ్వును తింటే చాలా మంచిది. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.కొబ్బరి పువ్వులో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి కావున బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ కొబ్బరి పువ్వు ఎంత‌గానో ఉపయోగపడుతుంది.

కొబ్బరి పువ్వు ఉపయోగాలు :కొబ్బ‌రి పువ్వును తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు కూడా త్వరగా రావు. కొబ్బరి పువ్వులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. కిడ్నీ ఇన్‌ఫెక్ష‌న్లు, కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కొబ్బ‌రి పువ్వు ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే కొబ్బ‌రి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. క‌నుక క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. కాబ‌ట్టి కొబ్బ‌రి పువ్వును త‌ర‌చూ తినాలి.

అందాన్ని కాపాడడంలో :

కొబ్బ‌రి పువ్వును తిన‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా చ‌ర్మానికి కావ‌ల్సిన తేమ ల‌భిస్తుంది. దీంతో చ‌ర్మం మృదువుగా ఉంటుంది. అలాగే జుట్టు రాల‌కుండా చేసే గుణాలు కూడా ఈ పువ్వులో ఉంటాయి.కొబ్బరి పువ్వు తినడం వలన జుట్టు పెరుగుద‌ల కూడా బాగుంటుంది. ఈ కొబ్బ‌రి పువ్వు మ‌న‌కు ఎక్కువ‌గా ముదిరిపోయిన కొబ్బ‌రికాయ‌ల్లో ల‌భిస్తుంది. తినడానికి కూడా కొబ్బరి పువ్వు చాలా రుచికరంగా ఉంటుంది.


Share

Related posts

షుగర్ ఉంటే శృంగార సామర్థ్యం తగ్గడం నిజమా? అపోహ?

siddhu

Tomato Pulao: టేస్టీ టమోటా పులావ్ క్షణాల్లో చేసేయండిలా..!

bharani jella

Stomach Pain: తరచు కడుపునొప్పి వస్తుందా..ఈ చిట్కాను పాటించండి..

bharani jella