హెల్త్

బొప్పాయి తినండి..ఈ వ్యాధులను తరిమికొట్టండి..!!

Share

బొప్పాయి పండు గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు.ఒక‌ప్పుడు బొప్పాయి పండ్ల చెట్టు ఇంటికి ఒకటి ఉండేది. పెరట్లో కాచిన బొప్పాయి పండ్లను తిని ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో బొప్పాయి పండ్లను మార్కెట్ నుండి మాత్ర‌మే కొనుక్కోవాలిసిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ బొప్పాయి పండులో ఎన్నో రకాల పోష‌కాలు దాగి ఉన్నాయి.ముఖ్యంగా బొప్పాయి పండులో ఫైబ‌ర్, పొటాషియం, విట‌మిన్ ఎ, సి, ఇ, కె ఇంకా బి కి చెందిన‌ విట‌మిన్లు అలాగే ఫోలేట్ కూడా ఎక్కువ‌గా ఉంటాయి. అంతే కాకుండా మెగ్నిషియం, కాల్షియం, ఫాస్ప‌ర‌స్, ఐర‌న్ ఇంకా మాంగ‌నీస్ లాంటి మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి.

షుగర్ లెవెల్స్ క్రమబద్దీకరణలో:

ఇంకా బొప్పాయి పండు డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఒక గొప్ప వరం అనే చెప్పాలి.బొప్పాయిలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వ‌ల‌న షుగ‌ర్ స్థాయిలు అనేవి పెర‌గ‌డం జరగదు.అలాగే బొప్పాయిలో ఉండే ఫైబ‌ర్లు, యాంటీ ఆక్సీడెంట్లు జీర్ణాశ‌యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడంలో :

బొప్పాయిలో ల‌భించే ఫోలేట్,పొటాషియంలు ర‌క్త నాళాల్లో అలాగే గుండెకు చేరే ర‌క్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా అయ్యేలా చేస్తాయి.ఈ విధంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.గుండె జబ్బుల బారినుండి కూడా రక్షణ. పొందుతాము.

రోగనిరోధక శక్తి :

బొప్పాయిలో ఉన్న విట‌మిన్ ఎ, విట‌మిన్ సి ఇంకా విట‌మిన్ ఇ లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఫలితంగా జ్వ‌రం, జ‌లుబు, ఇతర ఇన్ఫెక్ష‌న్లు అంత త్వరగా మ‌న ద‌రి చేర‌వు. బొప్పాయి పండులో పాపెయిన్, కైమో పాపెయిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మ‌నం తినే ఆహారంలోని ప్రొటీన్ల‌ను అమైనో యాసిడ్లుగా మారుస్తాయి. ఈ అమైనో యాసిడ్లు పొట్ట‌లోని ఇబ్బందుల‌ను ఇంకా మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తాయి.

అందాన్ని కాపాడంలో:

బొప్పాయి పండులో ల‌భించే విట‌మిన్ సి, ఇ అలాగే బీటా కెరోటిన్లు చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం, చ‌ర్మం పాడ‌వ‌డం లాంటి సమస్యలను తగ్గిస్తాయి.అలాగే వ‌య‌సు మీద ప‌డ‌డం వ‌ల‌న వ‌చ్చే ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా రానివ్వ‌దు.చ‌ర్మానికి మంచి రంగు అలాగే నిగారింపు నిస్తుంది. అంతే కాకుండా దీనిలో ఉండే విట‌మిన్ ఎ వ‌య‌సు మీద ప‌డ‌టం వ‌ల‌న వ‌చ్చే వివిధ కంటి స‌మ‌స్య‌ల‌ను కూడా తగ్గిస్తుంది.


Share

Related posts

Samudra Pala: ఏనుగంత శక్తినిచ్చే ఈ మొక్క గురించి విన్నారా..!?

bharani jella

తేనే లో దీన్ని నానబెట్టి తింటే రాత్రి పూట ఎదురైయే  ఆ సమస్య తగ్గిపోతుంది.

Kumar

Corona: షాక్ః ప‌క్క రాష్ట్రంలో కొత్త ర‌కం క‌రోనా కేసు

sridhar